Tuck Jagadish Song: సెప్టెంబర్ 1 న విడుదలైన 'టక్‌ జగదీష్‌' (Tuck Jagadish) సినిమా ట్రైలర్ మంచి టాక్ సొంతం చేసుకుంది. కాగా.. వినాయక చవితి (Ganesh chaturthi 2021 date) కానుకగా సెప్టెంబర్ 10న అమెజాన్ ప్రైమ్‌లో (Amazon Prime) విడుదల కానుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ రోజే విడుదలైన టక్‌ జగదీష్‌ సినిమా పాట (Tuck Jagadish Song) ఆకట్టుకుంటుంది. ఈ సినిమా కోసం మొదటి సారి దర్శకుడు శివ (Director Shiva) నాని క్యారెక్టర్‌ తెలియజేసేలా రూపొందించిన ‘సల్లాటి కుండలో.. సల్ల సక్క మనసువాడు’ పాటను పాడారు.


Also Read: Viral: రైల్లో అండర్‌వేర్‌తో తిరుగుతున్న ఎమ్మెల్యే (MLA).. అడిగితే తోటి వారితో గొడవ..!!


మొదటగా ఈ పాటను హీరో నానితో పాడిద్దామని డైరెక్టర్ శివ, మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ (Gopi Sundhar) అనుకుంటారు. అయితే నాని ఏం పాట అనగానే... శివ పాటను పాడి వినిపిస్తారు.. అయితే శివ సీమ యాస (Rayalaseema Slang) చూసిన నాని ఈ పాట మీరే పాడాలని చెప్పగానే.. పాట ప్రారంభం అవుతుంది. ప్రస్తుతం ఈ పాట ట్రేండింగ్ లో ఉంది. 



కుటుంబ బాంధవ్యాల కోసం ఏమైనా చేసే యువకుడిగా, ఎవరినైనా ఎదిరించే వ్యక్తిగా టక్ జగదీష్ పాత్రలో నాని కనపడుతుండగా...  నిన్ను కోరి (Ninnu kori movie), మజిలీ (Majili)వంటి ఎమోషనల్ ఎంటర్‌టైనర్స్ డైరెక్ట్ చేసిన శివ నిర్వాణ ఈసారి కూడా టక్ జగదీష్ మూవీతో మరో హిట్ కొత్తనున్నట్టు తెలుస్తుంది.  


Also Read: Bigg Boss Telugu 5: ఈ 5 గురి కంటెస్టెంట్ల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?? వైరల్!




ఈ చిత్రాన్ని షైన్‌ స్ర్కీన్‌ పతాకంపై సాహు గారపాటి, హరిష్ పెద్ది సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ (Thaman) కంపోజ్ చేయగా, గోపీ సుందర్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందించాడు. టక్ జగదీష్ సినిమాలో నటి రీతూ (Reetu varma) వర్మ ఒక వీఆర్వో పాత్రలో కనిపించనుండగా, మరో హీరోయిన్ గా ఐశ్వర్యా రాజేశ్‌ (Aishwarya Rajesh) మరియు జగపతిబాబు (Jagapathi Babu) ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook