ప్రపంచంలో అత్యంత అందమైన నటీమణుల్లో ఒకరైనా అలెంగ్జాండ్ర దద్దారియోకు ( Alexandra Daddario ) భారతీయ యువకుడు చేసిన తుంటరి ట్వీట్ బాగా నచ్చింది. అలెగ్జాండ్రా స్వయంగా ఈ విషయాన్ని ట్వీట్ చేసి వెల్లడించింది.   #Couplechallenge అనే హ్యాష్ ట్యాగ్ ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతోంది. ఇందులో తమకు నచ్చిన వ్యక్తితో కలిసిన ఫోటోలను చాలా మంది సోషల్ మీడియాలో ( Social Media ) షేర్ చేస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ALSO READ|  Allu Arjun: పుష్ప కోసం పులితో ఫైట్..అల్లు అర్జున్ మెగా రిస్క్


అందులో భాగంగా ఒక ట్విట్టర్ యూజర్ చేసిన ట్వీట్ ప్రస్తుతం బాగా వైరల్ ( Viral ) అవుతోంది. తన ఫేవరిట్ హాలీవుడ్ తార అలెగ్జాండ్ర దద్దారియోతో తను ఉన్నట్టు చూపిస్తూ తన ఫోటోషాప్ స్కిల్స్ తో ప్రపంచానికి చూపించాడు. అది చూసి నటి ఈ పోస్ట్ చాలా ఫన్నీగా ఉంది అని ట్వీట్ చేసింది. ఈ చిత్రంలో ఒక కుర్రాడు ముఖానికి మాస్కు, చేతులకు గ్లౌజ్ ధరించి వ్యవసాయ భూమి లో నిలబడతాడు.



ఇందులో అమెరికాకు చెందిన నటి అలెగ్జాండ్ర కూడా ఉండటంతో ఈ ఫోటో బాగా వైరల్ అవుతోంది. ఈ ఫోటో నూటిని నూరు శాతం ఫోటో షాప్ చేసిందే. అయితే అతని క్రియేటివిటీని మాత్రం మెచ్చుకోవాల్సిందే అంటున్నారు నెటిజెన్స్. ఈ ఫోటోకు అతను పెట్టిన క్యాప్షన్ కూడా చాలామందికి నచ్చింది. అసూయ కలిగిన వాళ్లు దీన్ని ఫోటోషాప్ అంటున్నారు అని కామెంట్ చేశాడు ఆ కుర్రాడు.



ALSO READ|  IPL 2020: ఐపీఎల్ లో ఎక్కువ సార్లు టీమ్స్ మార్చిన ప్లేయర్స్ వీరే


హాలీవుడ్ బ్యూటీ సమాధానం..
అతను చేసిన ట్వీట్ ను చూసిన అలెగ్జాండ్రా.. రీ ట్వీట్ చేసి రిప్లై ఇచ్చింది. ఈ వారం చాలా సరదాగా ఉంది అని ట్వీట్ చేసింది అమ్మడు. దీంతో ఈ ట్వీట్ అంతర్జాతీయంగా బాగా వైరల్ అయింది. దాదాపు 75 వేల మంది దీన్ని లైక్ చేశాడు. వేలాది మంది రీ ట్వీట్ చేశాడు.



A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR