Allu Arjun: పుష్ప కోసం పులితో ఫైట్..అల్లు అర్జున్ మెగా రిస్క్

తెలుగు సినీ పరిశ్రమలో ( Tollywood )  టాప్ హీరోల్లో స్టైలిష్  స్టార్ అల్లు అర్జున్ ఒకరు. బన్నీకి తెలుగుతో పాటు దేశ వ్యాప్తంగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 

Last Updated : Sep 25, 2020, 10:34 PM IST
    • తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోల్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు.
    • బన్నీకి తెలుగుతో పాటు దేశ వ్యాప్తంగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
    • ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో యాక్షన్ డ్రామా చిత్రం పుష్పలోనటిస్తున్నాడు అల్లు అర్జున్.
    • ఈ మూవీలో కన్నడ బ్యూటి రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తోంది.
Allu Arjun: పుష్ప కోసం పులితో ఫైట్..అల్లు అర్జున్ మెగా రిస్క్

తెలుగు సినీ పరిశ్రమలో ( Tollywood )  టాప్ హీరోల్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు. బన్నీకి తెలుగుతో పాటు దేశ వ్యాప్తంగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో యాక్షన్ డ్రామా చిత్రం పుష్పలో ( Pushpa ) నటిస్తున్నాడు అల్లు అర్జున్. ఈ మూవీలో కన్నడ బ్యూటి రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తోంది. అయితే రోనావైరస్ ( Coronavirus ) వల్ల సినిమా షూటింగ్ కొంత కాలం ఆగిపోగా.. మళ్లీ చిత్రీకరణ మొదలుపెట్టాలి అని యూనిట్ భావిస్తున్నట్టు సమాచారం.

ALSO READ|  SP Balasubrahmanyam Facts: గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం గురించి ఎవరికీ తెలియని విషయాలు

ఈ యాక్షన్ డ్రామా చిత్రంలో అల్లు అర్జున్ ( Allu Arjun ) లారీ డ్రైవర్ పాత్రలో కనిపించనున్నాడు. మరోవైపు పల్లెటూరి అమ్మాయిగా రష్మికా సందడి చేయనుంది. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో అల్లు అర్జున్ ఇంట్రో సీన్ చాలా స్పెషల్ గా ఉండనుందట. ఇందులో కొన్ని సీన్స్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తాయని తెలుస్తోంది. ముఖ్యంగా ఇందులో పులితో ఫైట్ సీన్ ఉంది అని.. అది తప్పకుండా ఆడియెన్స్ ను ఇంప్రెస్ చేస్తుందట. ఈ ఫైట్ సీన్ ను తెరకెక్కించడానికి ప్రత్యేక ప్రణాళిక వేస్తున్నారని... దీని కోసం అల్లు అర్జున్ ప్రిపేర్ అవుతున్నాడట.

ALSO READ|  SP Balasubrahmanyam: ఎస్పి బాలసుబ్రహ్మణ్యం టాప్ 10 తెలుగు సాంగ్స్

బన్నీ, రష్మికా జోడిగా వస్తోన్న పుష్ప చిత్రం తమిళం, తెలుగు, హిందీ,  కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఇందులో బన్నీపాత్ర తప్పకుండా ఎంటర్ టైన్ చేస్తుందని సమాచారం. ఇంతకు ముందు అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ( Trivikram ) దర్శకత్వంలో తెరకెక్కిన అల వైకుంఠపురములో చిత్రంలో కనిపించాడు. ఇది బాక్సాఫిస్ ను షేక్ చేసింది.

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News