Allu Arjun Car: హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పక్కాగా విధులు నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్ ఉల్లంఘిస్తే ఎవరైనా ఒకటే అంటున్నారు. ఏకంగా సినీ సెలెబ్రిటీల వాహనాలకు చలాన్ విధించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలుగు సినీ పరిశ్రమ మేటి నటుల కార్లకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు షాకిచ్చారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే..సామాన్యులైనా, సెలెబ్రిటీలైనా ఒకటే అని నిరూపించారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లోని నీరూస్ చౌరస్తాలో వాహనాల తనిఖీలో భాగంగా ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. అల్లు అర్జున్ కారును ఆపి..కారు అద్దాలకున్న బ్లాక్ ఫిల్మ్ తొలగించి..7 వందల రూపాయల జరిమానా విధించారు. మరోవైపు అదే దారిలో వెళ్తున్న హీరో కళ్యాణ్ రామ్ కారును కూడా పోలీసులు అడ్డుకుని జరిమానా విధించారు. 


TS 13 EL0001 కారు satyadeva pharmaceuticals pvt ltd అనే పేరు మీద ఉన్నట్టు ట్రాఫిక్ చలాన్ చూపిస్తోంది. ఈ కంపెనీ గురించి మరిన్ని వివరాలు పరిశీలించినప్పుడు..అందులో నందమూరి స్వాతి డైరెక్టర్‌గా ఉన్నట్టు చూపిస్తోంది. నందమూరి స్వాతి అంటే కళ్యాణ్ రామ్ భార్య. అంటే ఆమె ఈ కంపెనీలో డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారని అర్థమవుతోంది. అందువల్లే కళ్యాణ్ రామ్ కారు ఆ కంపెనీ పేరుపై రిజిస్టర్ అయి ఉంది. 


Also read: RRR Movie Talk: ఆర్ఆర్ఆర్ సినిమా ఉత్తరాదిన క్లిక్ కాలేదా, కధ నచ్చలేదా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook