RRR Movie Talk: ఆర్ఆర్ఆర్ సినిమా ఉత్తరాదిన క్లిక్ కాలేదా, కధ నచ్చలేదా

RRR Movie Talk: ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపిన ఆర్ఆర్ఆర్ హిటా్ టాక్ తెచ్చుకున్నా..కధ పరంగా డివైడెడ్ టాక్ విన్పిస్తోంది. కలెక్షన్స్ పరంగా చూస్తే..దక్షిణాది కల్పిత కధ ఉత్తరాదికి ఎక్కలేదా..నెమ్మదిగా నచ్చుతుందా అనే ప్రశ్నలు విన్పిస్తున్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 27, 2022, 08:40 AM IST
RRR Movie Talk: ఆర్ఆర్ఆర్ సినిమా ఉత్తరాదిన క్లిక్ కాలేదా, కధ నచ్చలేదా

RRR Movie Talk: ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపిన ఆర్ఆర్ఆర్ హిటా్ టాక్ తెచ్చుకున్నా..కధ పరంగా డివైడెడ్ టాక్ విన్పిస్తోంది. కలెక్షన్స్ పరంగా చూస్తే..దక్షిణాది కల్పిత కధ ఉత్తరాదికి ఎక్కలేదా..నెమ్మదిగా నచ్చుతుందా అనే ప్రశ్నలు విన్పిస్తున్నాయి.

బాహుబలి తరువాత ఆ స్థాయిలో నిర్మితమైన రాజమౌళి సినిమా ఆర్ఆర్ఆర్. పాన్ ఇండియా మూవీగా పలు భాషల్లో విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. కలెక్షన్ల పరంగా బాగుంది. అయితే అదే సమయంలో కథ విషయంలో కాస్త విభిన్నమైన టాక్  విన్పిస్తోంది. ఉత్తరాది, దక్షిణాది నటులతో నిర్మితమైన ఈ సినిమా గ్రాఫిక్స్, విజ్యువల్ ఎఫెక్ట్ పరంగా బాగుంది. రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌ల నటన అద్భుతంగా ఉందని ప్రేక్షకులు కితాబిస్తున్నారు. అంతా బాగానే ఉన్నా..ఎక్కడో చిన్న మైనస్ కన్పిస్తోంది. 

అది కథ. చరిత్రలోని రెండు ప్రాంతాలకు చెందిన పాత్రల్ని తీసుకుని..అల్లిన కల్పిత గాధ ఇది. ఈ చరిత్ర కూడా దేశవ్యాప్తంగా ప్రాచుర్యమైంది కాదు. కేవలం రెండు తెలుగు రాష్ట్రాలకు చెందింది. బహుశా ఈ కారణమే సినిమాలో మైనస్‌గా కన్పిస్తోందని చెప్పవచ్చు. మొదటి రోజు కలెక్షన్స్ బాగున్నా..హిందీ వెర్షన్ మాత్రం ఆశించిన స్థాయిలో లేదని చెప్పాలి. రాజమౌళి నిర్మించిన బాహుబలి 2 ఉత్తరాదిన తొలిరోజే..41 కోట్లు వసూలు చేసింది. ఇక బాహుబలి ఫేమ్ ప్రభాస్ నటించిన సాహో..తొలిరోజు 25 కోట్లు వసూలు చేసింది. ఈ నేపధ్యంలో ఆర్ఆర్ఆర్‌పై ఇంకా భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఆర్ఆర్ఆర్ హిందీ వెర్షన్ తొలిరోజు 19 కోట్లే వసూలు చేసి..సాహో కంటే వెనుకబడింది. 

రెండవ రోజు అంటే మార్చ్ 27వ తేదీన కలెక్షన్స్ స్థిరంగా ఉన్నాయని తెలుస్తోంది. తెలుగు, కన్నడ భాషల్లో అద్భుతమైన కలెక్షన్సు వసూలు చేస్తోంది. ఉత్తరాదిన కధపై ప్రస్తుతానికి డివైడెట్ టాక్ కన్పిస్తోంది. దక్షిణాది కల్పిత కధ కావడం, నాటు నాటు పాట తప్ప మరేదీ అంతగా ఆకట్టుకోలేక పోవడం కారణంగా తెలుస్తోంది. ఇటు తెలుగులో కూడా సినిమా హిట్టైందా లేదా అనేది వారం రోజుల తరువాతే అంచనా వేయవల్సి ఉంటుంది. కధ విషయంలో పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే మాత్రం ఇక సినిమా దూసుకుపోతుంది. 

Also read: CSK vs KKR: కేకేఆర్ బౌలింగ్ ముందు చతికిలబడిన సీఎస్కే. తొలి మ్యాచ్‌లో కేకేఆర్ విజయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News