Hyper Aadi Bald Head  హైపర్ ఆదికి బుల్లితెరపై ఉన్న క్రేజ్, ఫాలోయింగ్ అందరికీ తెలిసిందే. ఆది ఉంటే ఆ షో హిట్టే అన్నట్టుగా మారిపోయింది. ఆది రైటింగ్, యాక్టింగ్ అన్నీ కూడా జనాలకు తెగ నచ్చేస్తుంటుంది. అయితే ఆదికి బుల్లితెరపై మంచి డిమాండ్ ఉంటుంది. కానీ వెండితెరపై మాత్రం ఆది పంచ్‌లు అంతగా వర్కౌట్ అవ్వవనిపిస్తోంది. ఆది నటించిన ఏ సినిమాలోనూ ఆయన పంచ్‌లు అంతగా పేలలేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బుల్లితెరపై మాత్రం ఆదికి తిరుగుండదు. ఆది పంచ్‌లు వేస్తే అవతలి వాళ్లు నోరెళ్లబెట్టాల్సిందే. ఆది ప్రస్తుతం జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీ, ఢీ షోలు అంటూ ఇలా ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈటీవీ, మల్లెమాల షోలతో ఆది తెగ బిజీగా ఉన్నాడు. మధ్యలో కొన్ని రోజులు జబర్దస్త్ షోకు దూరంగా ఉన్నాడు. ఇక మొత్తానికి మల్లెమాల నుంచి బయటకు వస్తాడనే టాక్ కూడా స్ప్రెడ్ అయింది. కానీ మళ్లీ ఆది జబర్దస్త్ షోలోకి వచ్చేశాడు.


యథాతథంగా మూడు షోలు చేసుకుంటూ ఫుల్ బిజీగా ఉన్నాడు ఆది. తాజాగా శ్రీదేవీ డ్రామా కంపెనీ ప్రోమోను వదిలారు. ఇందులో ఆదికి అవమానం జరిగినట్టుగా ప్రోమోను కట్ చేశారు. జబర్దస్త్ అయినా శ్రీదేవీ డ్రామా కంపెనీ అయినా కూడా ఆదికి ఎదురు ఉండదు. అలాంటి ఆదికి ఇలా గుండు కొట్టించారంటే ఎవ్వరూ నమ్మరు. కానీ నమ్మేట్టుగా ప్రోమోను కట్ చేసింది మల్లెమాల టీం.


 



ఓ నంబర్ ఎంచుకోవాలి.. అందులో ఏం వస్తే అది చేయాలి. అని ఉంటుంది. ముందుగా ఓ నంబర్ సెలెక్ట్ చేసుకున్న ఆదికి బంపర్ ఆఫర్ వచ్చింది. ముప్పై సెకన్లు ముద్దు పెట్టుకోవాలని వచ్చింది. దీంతో నరేష్ ముందు జాగ్రత్తగా ఐశ్వర్యను బయటకు పంపించాడట. ఐశ్వర్యను ముద్దు పెట్టుకోవాలని ఆది బాగానే ప్రయత్నించాడు. ఇంకో నంబర్ సెలెక్ట్ చేసుకో అని అందరూ అనేశారు.


దీంతో ఈసారి గుండు కొట్టించుకోవాలని వచ్చింది. అలా రావడంతో శ్రీదేవీ డ్రామా కంపెనీ ఆర్టిస్టులంతా స్టేజ్ మీదకు ఒకేసారి వచ్చారు. ఆదికి గుండు కొట్టే ప్రయత్నం చేశారు. గుండు కొట్టినట్టుగా చూపించారు. కానీ అది ఎవరిది? అనేది తెలియడం లేదు. మొత్తానికి టీఆర్పీ పెంచుకునే క్రమంలో ఇలా ప్రోమోను ఇంట్రెస్టింగ్‌గా కట్ చేశారు.


Also Read : Prabhas Kriti Sanon Marriage : కృతి సనన్‌తో త్వరలోనే పెళ్లి.. ప్రభాసే ముందు ప్రపోజ్ చేశాడట!


Also Read : ఆ అంకుల్ తో మీనా రెండో పెళ్లంటూ ప్రచారం.. నిజం చెప్పేసిన సన్నిహితులు!


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook