Flash mob: బుట్టబొమ్మ పాటకు స్టెప్పేసిన ఇండిగో ఎయిర్‌లైన్స్ స్టాఫ్
అల వైకుంఠపురములో సినిమా ( Ala Vaikunthapuramlo movie ) విడుదలై ఇన్ని రోజులవుతున్నా... ఆ సినిమా పాటలకు ఉన్న క్రేజ్ మాత్రం అంతకంతకూ పెరుగుతూనే ఉంది కానీ ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ సినిమాకు ఎస్ఎస్ థమన్ అందించిన మ్యూజిక్ అటువంటిది మరి.
అల్లు అర్జున్ ( Allu Arjun ) హీరోగా తెరకెక్కిన అల వైకుంఠపురంలో మూవీ ఈ ఏడాది ఆరంభంలో సంక్రాంతి కానుకగా ఆడియెన్స్ ముందుకొచ్చింది. అల వైకుంఠపురములో సినిమా ( Ala Vaikunthapuramlo movie ) విడుదలై ఇన్ని రోజులవుతున్నా... ఆ సినిమా పాటలకు ఉన్న క్రేజ్ మాత్రం అంతకంతకూ పెరుగుతూనే ఉంది కానీ ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ సినిమాకు ఎస్ఎస్ థమన్ అందించిన మ్యూజిక్ అటువంటిది మరి. అల వైకుంఠపురములో మూవీ సాంగ్స్‌లో ఒక్కో సాంగ్‌కి ఒక్కో ప్రత్యేకత ఉంది. పాటలన్నీ ఒకదానితో మరొకటి పోటీపడినట్టుగా ఉండటం వల్లే ఆ చిత్రం మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. ముఖ్యంగా బుట్ట బొమ్మ సాంగ్ ( Buttabomma song dance ) కోట్లాదిమంది ఆడియెన్స్‌ని మెస్మరైజ్ చేసింది. సోషల్ మీడియాలో ఈ పాట ఎంత వైరల్‌గా మారిందో అందరికీ తెలిసిందే. అందుకే తాజాగా వైజాగ్ ఎయిర్ పోర్టులో ఇండిగో ఎయిర్ లైన్స్ సిబ్బంది బుట్ట బొమ్మ పాటకు ఫ్లాష్ మాబ్ తరహాలో ( Buttabomma song flash mob ) స్టెప్పేసి ఆ పాటపై తమకున్న మక్కువను చాటుకున్నారు. (Also read: Oxford university's vaccine: కరోనావైరస్ వ్యాక్సిన్‌పై గుడ్ న్యూస్ వచ్చేసింది )
త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన కన్నడ బ్యూటీ పూజా హెగ్డె ( Pooja Hegde ) జంటగా నటించగా.. సీనియర్ హీరోయిన్ టబు, సుశాంత్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సూపర్ హిట్ అయిన ఈ సినిమాను అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణ నిర్మించారు. (Also read: ICC T20 World Cup 2020: ఐసిసి టీ20 వరల్డ్ కప్ వాయిదా )