ప్రభాస్ బర్త్ డే డేట్ ( Prabhas birthday ) సమీపిస్తోంది. ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్ ( Radheshyam movie ) సినిమా చేస్తుండగా ఆ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ఆ తర్వాత ఓం రావత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమా ( Adipurush ) చేయనున్నాడు. ప్రభాస్ బర్త్ డే సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో ఆయన అభిమానులకు ప్రభాస్ పుట్టిన రోజు కానుకగా తమ చిత్రాలకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు లేదా పోస్టర్స్ విడుదల చేసేందుకు మూడు చిత్రాలకు సంబంధించిన దర్శకులు, చిత్ర నిర్మాణ సంస్థలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. Also read : Jordar Sujatha about BB4 Telugu: అది నా తప్పు కాదు.. బిగ్ బాస్ నిర్ణయం: జోర్దార్ సుజాత


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదిలావుంటే, ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో తెరకెక్కనున్న ఆదిపురుష్ సినిమాలో సీత పాత్రలో ( Sita in Adipurush movie ) నటించబోయే హీరోయిన్ ఎవరనే ప్రశ్న కేవలం ప్రభాస్ ఫ్యాన్స్‌లోనే కాదు.. ఆదిపురుష్ మూవీతో మరో దృశ్య కావ్యాన్ని ఎంజాయ్ చేయవచ్చని భావిస్తున్న ఆడియెన్స్ అందరిలోనూ ఉంది. ఈ నెల 23న ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఆదిపురుష్ సినిమాలో సీత పాత్రలో నటించబోయే హీరోయిన్ వివరాలు వెల్లడించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు ఫిలింనగర్ వర్గాల సమాచారం. Also read : Annapurna Studios: అగ్ని ప్రమాదంపై స్పందించిన అన్నపూర్ణ స్టూడియో


ఆదిపురుష్ మూవీలో సీత పాత్ర కోసం పలువురు హీరోయిన్స్ పేర్లు పరిశీలిస్తున్నట్టు ఎప్పటికప్పుడు బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే అనేక మంది హీరోయిన్స్ పేర్లు వినిపించగా తాజాగా ఆ జాబితాలో కృతిసనన్ ( Actress Kriti Sanon ) పేరు వినిపిస్తోంది. కృతి సనన్ గుర్తుంది కదా.. 2014లో మహేష్ బాబు ( Mahesh Babu ) సరసన 1 నేనొక్కడినే చిత్రం ద్వారా తొలిసారి హీరోయిన్‌గా పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాతి ఏడాది నాగచైతన్యతో దోచేయ్ మూవీ చేసింది. ఆ తర్వాత గత ఐదేళ్లుగా బాలీవుడ్ సినిమాలు చేస్తూ అక్కడే బిజీ అయ్యిందీ ఢిల్లీ బ్యూటీ. Also read : Sanjay Dutt cancer treatment: క్యాన్సర్ చికిత్స తర్వాత తొలిసారి కెమెరా ముందుకు సంజయ్ దత్


ప్రభాస్ బర్త్ డే రోజు కృతి సనన్ ఎంపికపై ఆదిపురుష్ మేకర్స్ ఓ ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు బాలీవుడ్ మీడియాలో ఓ టాక్ వినిపిస్తోంది. ఇందులో ఎంతమేరకు నిజం ఉందో తెలియాలంటే.. ప్రభాస్ బర్త్ డే వరకు వేచిచూడాల్సిందే. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G