Sanjay Dutt cancer treatment: క్యాన్సర్ చికిత్స తర్వాత తొలిసారి కెమెరా ముందుకు సంజయ్ దత్

బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ ( Sanjay Dutt ) అభిమానులకు ఇది గుడ్ న్యూస్. సంజయ్ దత్‌కి క్యాన్సర్ సోకినట్టు గుర్తించిన అనంతరం చికిత్స కోసం విదేశాలకు వెళ్లిన సంగతి అందరికీ తెలిసిందే. క్యాన్సర్ చికిత్స ( Sanjay Dutt cancer treatment ) గురించి, దానిని ధైర్యంగా ఎదుర్కొని పోరాడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని గతంలోనే ట్విటర్ ద్వారా వెల్లడించిన సంజయ్ దత్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వీడియో ద్వారా అభిమానుల ముందుకొచ్చేశాడు.

Last Updated : Oct 15, 2020, 04:44 PM IST
Sanjay Dutt cancer treatment: క్యాన్సర్ చికిత్స తర్వాత తొలిసారి కెమెరా ముందుకు సంజయ్ దత్

బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ ( Sanjay Dutt ) అభిమానులకు ఇది గుడ్ న్యూస్. సంజయ్ దత్‌కి క్యాన్సర్ సోకినట్టు గుర్తించిన అనంతరం చికిత్స కోసం విదేశాలకు వెళ్లిన సంగతి అందరికీ తెలిసిందే. క్యాన్సర్ చికిత్స ( Sanjay Dutt cancer treatment ) గురించి, దానిని ధైర్యంగా ఎదుర్కొని పోరాడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని గతంలోనే ట్విటర్ ద్వారా వెల్లడించిన సంజయ్ దత్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వీడియో ద్వారా అభిమానుల ముందుకొచ్చేశాడు. దుబాయ్ నుంచి ఇండియాకు తిరిగొచ్చిన సంజయ్ దత్.. ముంబైలో తాను రెగ్యులర్‌గా వెళ్లే హేర్ స్టైలిస్ట్ ఆలిం హకీం సెలూన్‌కి ( Hair stylist Aalim Hakim's saloon ) వెళ్లి స్టైలిష్ హేర్ కటింగ్ చేయించుకున్న అనంతరం అక్కడి నుంచే అలీం హకీం ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా సంజయ్ ఓ వీడియో విడుదల చేశాడు. తనని తాను సింపుల్‌గా ఐయామ్ సంజయ్ అని పరిచయం చేసుకున్న ఈ స్టార్ హీరో.. తాను క్యాన్సర్‌ని ఓడిస్తానని ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు. సంజయ్ దత్ ఆ వీడియోలో ఏం చెప్పుకొచ్చాడో మీరే చూడండి. Also read : Chinmayi slams Vairamuthu: వైరముత్తు వేధింపులపై మరోసారి చిన్మయి సంచలన ట్వీట్స్

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

@duttsanjay Today at Salon Hakim’s Aalim after getting a haircut done with all the necessary precautions Instructed by the government and the experts. #SanjayDutt #AalimHakim #Rockstar #SalonHakimsAalim #TeamHA #SafetyFirst #Fighter #Precautions #Hygiene #SocialDistancing #NewNorms #TeamHakimsAalim #SalonLife #Viral #Trending #MovieLife #actorslife #14thoctober2020 @duttsanjay @aalimhakim

A post shared by Aalim Hakim (@aalimhakim) on

కేజీఎఫ్ 2 మూవీలో ( KGF 2 movie ) అధిర పాత్రలో విలన్‌గా కనిపించనున్న సంజయ్ దత్.. నవంబర్ నుండి ఆ సినిమా షూటింగ్‌కి హాజరుకానున్నట్టు తెలిపాడు. అధిర పాత్ర కోసమే తాను తన గడ్డాన్ని స్టైల్‌గా గ్రూమ్ చేసుకుంటున్నట్టు సంజయ్ వెల్లడించాడు.

తన తండ్రి సునీల్ దత్‌కి ( Sunil Dutt ) అలీం హకీం వాళ్ల నాన్న హేర్ స్టైలిష్ట్ గా ఉండే వాడని.. ఆ తర్వాత అతడి తనయుడు అలీం తనకు హేర్ స్టైల్ సెట్ చేస్తూ వస్తున్నాడని అలీం హకీం కుటుంబంతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు. ఇలా సెలూన్‌కి రావడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్న సంజయ్ దత్.. ప్రభుత్వాల నిబంధనలకు అనుగుణంగా అన్ని జాగ్రత్తలతో అలీం హకీం సెలూన్ నిర్వహిస్తున్నాడని సంజయ్ చెప్పుకొచ్చాడు. Also read : Sushant Singh Rajput Case: ఫేక్ న్యూస్.. రూ.200 కోట్ల పరువు నష్టం దావా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News