Legally Veer Movie Review: సినీ పరిశ్రమలో వాస్తవ గాథలు ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. కోర్టు.. నేర సంబంధిత నేపథ్యంతో వస్తున్న సినిమాలు చిన్న చిత్రాలైనా కూడా వెండితెరపై విజయాలు సాధిస్తున్నాయి. థియేటర్‌, ఓటీటీ అనే దానితో సంబంధం లేకుండా సినిమా కథ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ క్రమంలో మరో కోర్టు నేపథ్యంతో కూడిన సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రవి గోగుల దర్‌శకత్వంలో లీగల్లీ వీర్‌ అనే సినిమా డిసెంబర్‌ 27వ తేదీన విడుదలైంది. వీర్ రెడ్డి, దయానంద్ రెడ్డి, ఢిల్లీ గణేశన్, గిరిధర్ ప్రధాన పాత్రల్లో న‌టించిన లీగల్లీ వీర్‌ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఆకట్టుకుందాం.. 2024లో చిన్న సినిమా హిట్‌ కొట్టిందా అనేది చూద్దాం.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: New Year Prabhas: న్యూ ఇయర్ వేళ ఫ్యాన్స్‌కు డార్లింగ్ ప్రభాస్ వీడియో సందేశం


కథ ఏమిటంటే?
బాలరాజు అనే సామాన్యుడు ఓ హత్య కేసులో చిక్కుకుంటాడు. ఆ హత్యతో అతడికి ఏమాత్రం సంబంధం లేదు. కానీ బాలరాజు చేసినట్లు ఆధారాలు ఉండడంతో ఆ కేసు నుంచి బయట పడలేక ఇబ్బందులు పడుతుంటాడు. ఈ సమయంలో ఈ హత్య కేసు నుంచి బాలరాజును బయట పడేసేందుకు వీర్ (మలికిరెడ్డి వీర్ రెడ్డి) కేసును వాదించడానికి ముందుకు వస్తాడు. కేసు తీసుకున్న తర్వాత ఆ హత్య కేసును తవ్వుతున్న కొద్ది విస్తుగొలిపే మలుపులు చోటుచేసుకుంటాయి. ఈ కేసు వెనుక చాలా మంది ఉన్నారని తెలుసుకున్న వీర్ ఆ హత్య కేసు నుంచి బాలరాజును ఎలా బయటపడేశాడు? ఇంతకు హంతకులు ఎవరు? ఏం జరిగింది అనేది తెలుసుకోవాలంటే 'లీగల్లీ వీర్' సినిమా చూడాల్సిందే.

Also Read: Dil Raju: మాజీ మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలు చాలా బాధాకరం.. దిల్‌ రాజు సంచలన వ్యాఖ్యలు


ఎలా తీశారంటే..?
విజయాలకు కేరాఫ్‌గా నిలుస్తున్న కోర్డు డ్రామా పాయింట్‌ను దర్శకుడు రవి గోగుల ఎంచుకోవడంలోనే విజయం సాధించాడు. స్క్రీన్‌ప్లే చక్కగా రాసుకున్న దర్శకుడు దానిని తీయడంలో కొంత తడబడ్డాడు. కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ జోడించడంతో సినిమాకు మైనస్‌గా మారింది. ఆసక్తికరంగా సాగుతున్న కథలో యాక్షన్‌ సన్నివేశాలు.. పాటలు అవరోధంగా మారాయి. అయితే తర్వాత అసలు కథను దారి తప్పకుండా దర్శకుడు జాగ్రత్తపడడంతో ప్రేక్షకుడి ఆత్రుత.. ఉత్సాహం కొనసాగుతుంది. అయితే కొన్ని సన్నివేశాలు కొన్ని సినిమాలను గుర్తుచేస్తుంటాయి. సాంకేతిక వర్గం నుంచి మంచి ఔట్‌ఫుట్‌ను దర్శకుడు రాబట్టుకున్నాడు.


ఎలా నటించారంటే?
న్యాయవాది పాత్రలో మలికిరెడ్డి వీర్‌ రెడ్డి ఒదిగిపోయాడు. పాత్రకు న్యాయం చేసే ప్రయత్నం చేశాడు. సన్నివేశాలు తెరపై చూడదగినట్టు ఉన్నాయి. అయితే తొలి సినిమా కావడంతో కొంత నటనలో మెలకువలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. బాలరాజు పాత్ర పోషించిన యువకుడు పరిధి మేర నటించి ప్రశంసలు అందుకున్నాడు. బాలరాజు భార్య పాత్రలో మెరిసిన నటి పాత్రలో ఒదిగిపోయింది.


సాంకేతికవర్గం  
చిన్న సినిమా అయినా కూడా సాంకేతికంగా ఉన్నతంగా ఉంది. సంగీతం పర్వాలేదనిపించింది. కెమెరా వర్క్, ప్రొడక్షన్ డిజైన్ చూస్తే ఇది చిన్న సినిమానా అని ఆశ్చర్యపోయేలా ఉంది. దర్శకుడు రవి గోగుల ఎంచుకున్న కథా వస్తువు బలంగా ఉండడంతో సినిమా చక్కగా వచ్చింది. కమర్షియల్ ఎలిమేంట్లకు వెళ్లడంతోనే కొంత ఇబ్బంది ఎదురైంది. స్క్రీన్ ప్లేలో జాగ్రత్తలు తీసుకోవడంతో కథ మరి అంతగా పక్కదారి పట్టలేదు. దర్శకుడు రవి గోగుల సఫలీకృతుడయ్యాడని చెప్పవచ్చు.


చివరగా..
కోర్టు డ్రామా.. కేసులను పరిశోధించడం వంటి ఆసక్తి ఉన్న వారికి ఈ సినిమా నచ్చుతుంది. 2024 ఏడాదిలో చిన్న సినిమా హిట్‌ కొట్టిందని చెప్పవచ్చు.


ట్రైలర్ లింక్

 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook