Guntur Kaaram Trailer: సంక్రాంతికి బ్లాక్ బస్టర్ సిద్ధం.. మరోసారి అదరగొట్టిన మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్
Guntur Kaaram: ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న గుంటూరు కారం ట్రైలర్ ఈరోజు విడుదల అయింది. మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం పై ప్రేక్షకులకు మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. కాగా ఈ ట్రైలర్ ఈ అంచనాలను మరింత రెట్టింపు చేసింది..
Mahesh Babu Guntur Kaaram Trailer Talk: మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా గుంటూరు కారం. జనవరి 12న విడుదల కాబోతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సంక్రాంతికి విడుదలవుతున్న చిత్రాలలో బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమానే ఎక్కువగా సెన్సేషన్ క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. కాగా ఈ చిత్ర ట్రైలర్ ఈరోజు విడుదలై అందరినీ ఆకట్టుకుంటోంది.
ఇక ట్రైలర్ విషయానికి వస్తే ‘మీ పెద్ద కొడుకుని అనాధ లాగా వదిలేసారు అంటున్నారు దానికి మీరేం చెప్తారు..’ అని రమ్యకృష్ణ క్యారెక్టర్ ని అడుగుతూ.. త్రివిక్రమ్ వాయిస్ ఓవర్ తో మొదలైంది. ఆ తరువాత మహేష్ బాబు మాస్ ఎంట్రీ తో.. చూడగానే మజా వచ్చిందా.. చూడగానే విజిల్ వెయ్యాలి అనిపించిందా అనే ఊర మాస్ డైలాగ్స్ తో హై ఎనర్జీ గా కొనసాగింది. ఇక ఆ తరువాత శ్రీలీల.. మీనాక్షి చౌదరి గ్లామర్ తో ..ప్రకాష్ రాజ్ విలన్ క్యారెక్టర్ తో.. ట్రైలర్ మొత్తం చాలా స్పైసీగా సాగుతూ ఉండగా ఫైనల్ లో ఎమోషనల్ టచ్ ఇచ్చారు త్రివిక్రమ్. ‘ఎప్పుడో చిన్నప్పుడు కొట్టాల్సిన అమ్మ.. ఇప్పుడు ఇస్తిరి చీర వేసుకొని మరీ కొడతా ఉన్నట్టు అనిపిస్తుంది రా’ అనే డైలాగ్ తో ఈ చిత్రం అమ్మ సెంటిమెంట్ తో సాగే చిత్రమని చెప్పకనే చెప్పారు.
ఇక అత్తారింటికి దారేది సినిమాలో.. అత్త కోసం అల్లుడు పడే తపన చూపించినట్టు ఈ చిత్రంలో చిన్నప్పుడే తన నుంచి దూరమైన అమ్మ కోసం కొడుకు పడే తపన చూపిస్తారేమో వేచి చూడాలి.
కాగా ఈ సినిమా నుంచి ఇటీవల వచ్చిన ‘కుర్చీని మడతపెట్టి’ సాంగ్ కూడా విపరీతంగా పాపులర్ అయింది. ఈ పాటలో మహేశ్ బాబు, శ్రీలీల ఊర నాటు స్టెప్‍లు అదిరిపోయాయి. థియేటర్లో ఈ పాట చూస్తే మహేష్ బాబు అభిమానులకు పూనకాలే అనే కామెంట్లు వస్తున్నాయి. పూర్తిస్థాయి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా గుంటూరు కారం ఉంటుందని ఇప్పటికే మూవీ యూనిట్ స్పష్టం చేసింది. ఇక ఈ ట్రైలర్ చూస్తే అది పక్కా అని తెలుస్తోంది.
శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు, రమ్యకృష్ణ, జయరాం, ఈశ్వరిరావు, ప్రకాశ్ రాజ్, సునీల్ ముఖ్య పాత్రలు చేశారు. ఈ చిత్రానికి ఎస్.థమన్ సంగీతం అందించారు. హాసినీ, హారిక క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ (చినబాబు) ఈ మూవీని నిర్మించారు.
Also read: Ram Mandir: అయోధ్య వెళ్లేవారు తప్పకుండా సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు..
Also Read: Sneha: మోదరన్ డ్రెస్సులు స్నేహ…చెక్కుచెదరని అంటోన్న అభిమానులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook