Nagarjuna in AP CM YS Jagan's biopic ?: మహీ వి రాఘవ్ దర్శకత్వం వహించిన వైయస్ఆర్ బయోపిక్ 'యాత్ర' ( YSR biopic Yatra ) గతేడాది ఫిబ్రవరిలో విడుదలైంది. ఇందులో మలయాళ స్టార్ మమ్ముట్టి వైయస్ఆర్ పాత్ర పోషించారు. మిక్స్‌డ్ రివ్యూస్ సొంతం చేసుకున్న ఈ సినిమాకు సినీ ప్రేమికుల నుండి మంచి ఆదరణ లభించింది. ఆ తరువాత మహీ వి రాఘవ్ యాత్ర 2 మూవీలో ( Yatra 2 movie ) కలుద్దాం అని ప్రకటించారు. యాత్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ( YS Rajasekhar Reddy ) ఆధారంగా తెరకెక్కిన విషయం తెలిసిందే. Also read : Suriya about NEET exam: సూర్యను చిక్కుల్లో పడేసిన 'నీట్ కామెంట్'


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యాత్ర 2 చిత్రంలో వైయస్ఆర్ కుమారుడు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి రియల్ స్టోరీ ( YS Jagan real story ) గురించి ఉండనుందని తెలుస్తోంది. టాలీవుడ్‌లో వినిపిస్తున్న టాక్ ప్రకారం, మహీ వి రాఘవ్ డైరెక్షన్‌లో కింగ్ నాగార్జున యాత్ర 2 మూవీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిగా ( Nagarjuna as AP CM YS Jagan ) కనిపించనున్నారని తెలుస్తోంది. ఐతే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. Also read : Bigg Boss 4 Telugu: బిగ్ బాస్ 4 తెలుగు: వైల్ట్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన సాయి కుమార్ ఎవరు ?


వైయస్ రాజశేఖర్ రెడ్డి 2003లో పాదయాత్రను ( YSR Padayatra ) చేపట్టి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1500 కిలోమీటర్ల దూరం కాలినడకన ప్రయాణించి ప్రజలకు చేరువైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జరిగిన 2004 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో అధికారంలోకి రావడంతో పాటు ఆయన ముఖ్యమంత్రి అయ్యేందుకు ఆ పాదయాత్ర సహాయపడింది. అదే తరహాలో తండ్రి వైఎస్ఆర్ బాటలో ఏపీలో 2019 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ ( YS Jagan ) చేసిన పాదయాత్ర కూడా ఆయనకు అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయాన్ని కట్టబెట్టింది. అందుకే యాత్ర 2 మూవీలో ( Yatra sequel movie ) వైయస్ఆర్ మరణానంతరం పరిణామాలు, జగన్ ముఖ్యమంత్రి కాకముందు చేసిన పాద యాత్ర, ఆ తర్వాత ఆయన సీఎం అయిన తీరు గురించి చూపించనున్నట్లు తెలుస్తోంది. Also read : Nayanthara Goa trip photos: బాయ్ ఫ్రెండ్ విఘ్నేష్ శివన్‌తో కలిసి గోవా ట్రిప్ ఎంజాయ్ చేస్తోన్న నయనతార


నిజంగానే ఏపీ సీఎం వైఎస్ జగన్ బయోపిక్ మూవీ సెట్స్‌పైకి వెళ్తూ అందులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌గా నాగార్జున నటిస్తున్నట్టయితే.. అటు సీఎం వైఎస్ జగన్ బయోపిక్ చూడబోతున్నందుకు ఆయన అభిమానులకు, అలాగే ఆ పాత్రలో నాగ్‌ని చూడబోతున్నందుకు నాగ్ అభిమానులకు ఇంట్రెస్టింగ్ న్యూస్ అన్నట్టే. Also read : Allu Arjun at Kuntala waterfalls: కుంటాల జలపాతం వద్ద అల్లు అర్జున్ సందడి.. ఫోటోలు వైరల్


మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYeR