Nani, Eesha Rebba fires on Viva Harsha in Sprite News Ad: టాలీవుడ్ హీరో, హీరోయిన్స్ ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు యాడ్స్ చేస్తున్నారు. టాలీవుడ్‌కు చెందిన స్టార్స్ కొందరు సినిమానే కాకుండా.. బిజినెస్‌, ప్రకటనలతోనూ ఎక్కువగా సంపాదిస్తున్నారు.  ఏడాది, ఆరు నెలల పాటు సినిమా తీస్తే వచ్చే డబ్బులు కేవలం రెండు నిమిషాల యాడ్ చేస్తే వచ్చేస్తుంది. అందుకే స్టార్స్ కొందరు యాడ్స్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రానా, సమంత, రష్మిక, రకుల్ ప్రీత్ సింగ్ వంటి వారు వివిధ బ్రాండ్లకు అంబాసిడర్లగా ఉన్నారు. ఈ జాబితాలో నాచురల్ స్టార్ నాని కూడా చేరిపోయిన విషయం తెలిసిందే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రముఖ శీతల పానీయం స్ప్రైట్‌కి నాని ప్రచార కర్తగా వ్యవహరిస్తున్నాడు. రెండేళ్ల క్రితం నుంచే నాని స్ప్రైట్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. మొదటి యాడ్‌లో 'ఇప్పుడు కార్లు వాటికవే నడుపుకుంటున్నాయి. ఆట ఆర్టిఫిషల్ అయిపొయింది. కానీ ఒక్క విషయం ఇప్పటికీ మారలేదు. మీ దాహం.. ఇంకా స్ప్రైట్‌ ఇచ్చే రిఫ్రెష్మెంట్. టాటా గారికి ఈ హైటెక్ ఫ్రిడ్జ్ ఎలా తెరవాలో తెలియకోవచ్చు.. కానీ ఇందులో ఉన్న స్ప్రైట్‌ని తెరిస్తే ఓమవుద్దో బాగా తెలుసు' అని నాని పేర్కొన్నాడు. ఆ యాడ్‌లో నాని సోలోగా నటించాడు. 


తాజాగా స్ప్రైట్‌ మరో సరికొత్త యాడ్‌తో వచ్చింది. ఈసారి నానితో పాటుగా తెలుగు అమ్మాయి ఈషా రెబ్బ, కమెడియన్ వైవా హర్షా కూడా సందడి చేశారు. ఈ యాడ్‌ను ఈషా రెబ్బ తన ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్ చేయగా.. అది కాస్త వైరల్ అయింది. తాజా యాడ్‌లో నాని, ఈషా రెబ్బ సోఫాలో కూర్చుని సినిమా చూస్తుండగా.. వైవా హర్షా డిస్టబ్ చేస్తాడు. దాంతో నాని బూతులు అందుకోగా.. ఈషా కూడా తగ్గేదెలే అంటూ వైవా హర్షాపై విరుచుకుపడుతుంది. అదే సమయంలో బీప్ బీప్ అని బీపీ పెంచుకోకండి.. స్ప్రైట్‌తో చిల్ అవండి అంటూ వెనకాల ఓ వాయిస్ వస్తుంది. వెంటనే ముగ్గురు కలిసి స్ప్రైట్‌ తాగి చిల్ అవుతారు. 



Also Read: పెళ్లి నిరాకరించిన యువతి.. బట్టలు విప్పి జుట్టు కత్తిరించారు! అసలు ట్విస్ట్ ఏంటంటే


Also Read: అవన్నీ అర్థం లేని మాటలే.. బుమ్రా, షమీ ఎప్పుడూ టీమిండియాతోనే ఉండరు: రోహిత్‌ శర్మ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.