Crime News: తండ్రితో పెళ్లికి నిరాకరించిందని యువతి బట్టలు విప్పి, జుట్టు కత్తిరించి బూట్లు నాకించిన వైనం.. ఎక్కడంటే?

Pakistan Girl Tortured for refusing to marry friend father. పెద్ద వయస్కుడైన ఓ వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిన బాలికను చిత్రహింసలకు గురిచేశారు.  

Written by - P Sampath Kumar | Last Updated : Aug 18, 2022, 03:24 PM IST
  • పెళ్లి నిరాకరించిన యువతి
  • బట్టలు విప్పి జుట్టు కత్తిరించారు
  • అసలు ట్విస్ట్ ఏంటంటే
Crime News: తండ్రితో పెళ్లికి నిరాకరించిందని యువతి బట్టలు విప్పి, జుట్టు కత్తిరించి బూట్లు నాకించిన వైనం.. ఎక్కడంటే?

Faisalabad Girl hair chopped for refusing to marry friend Old father: పాకిస్థాన్‌లోని ఫైసలాబాద్‌లో ఓ దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. పెద్ద వయస్కుడైన ఓ వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిన బాలికను చిత్రహింసలకు గురిచేశారు. పెళ్లి చేసుకునే వ్యక్తి కుటుంబ సభ్యులు బాలికను దారుణంగా అవమానపరిచడమే కాకూండా.. లైంగికంగా కూడా వేధించారు. చిన్న వయసులోనే ఆ యువతిని నానా కష్టాలు పెట్టారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. యువతికి వివాహం ఫిక్స్ అయిన వ్యక్తి ఆమె స్నేహితురాలి తండ్రి.

జియో న్యూస్ ప్రకారం.. ఫైసలాబాద్‌లో ఓ ఫ్యాక్టరీ యజమాని తన కూతురు స్నేహితురాలిపై కన్నేశాడు. భార్య, కూతురు అండతోనే పెళ్లి చేసుకోమని యువతిని బలవంతం చేశాడు. యువతి స్నేహితురాలు కూడా తన తండ్రిని వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేసింది. పెళ్లికి యువతి నిరాకరించడంతో.. ఫ్యాక్టరీ యజమాని, అతడి భార్య చిత్రహింసలకు గురి చేశారు. ఆపై యువతి బట్టలు విప్పి.. జుట్టు కత్తిరించారు. అక్కడితో ఆగకుండా కనుబొమ్మలను షేవ్ చేశారు. లైంగికంగా కూడా వేధించారు. 

అనంతరం ఫైసలాబాద్‌లోని ఖురియన్‌వాలా పోలీస్‌స్టేషన్‌లో యువతి ఫిర్యాదు చేసింది. తనను దారుణంగా హింసించారని, దాన్ని వీడియో తీశారని బాధితురాలు పోలీసులకు తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసి.. యువతి స్నేహితురాలి తల్లిదండ్రులతో పాటు ఆరుగురిని అరెస్టు చేశారు. వారిని త్వరలోనే కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ప్రధాన నిందితుడి ఇంట్లో మద్యం, ఆయుధాలు దొరకడంతో మరో కేసు కూడా నమోదైంది. ఆగస్టు 9న ఈ ఘటన జరగ్గా..  కాస్త ఆలస్యంగా విషయం బయటకువచ్చింది. యువతికి చిత్రహింసలకు సంబందించిన వీడియో బుధవారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Also Read: అవన్నీ అర్థం లేని మాటలే.. బుమ్రా, షమీ ఎప్పుడూ టీమిండియాతోనే ఉండరు: రోహిత్‌ శర్మ

Also Read: హిందీలో కార్తికేయ 2కి బ్రహ్మరధం.. 50 షోలతో మొదలై 3000 దాకా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News