Rohit Sharma: అవన్నీ అర్థం లేని మాటలే.. బుమ్రా, షమీ ఎప్పుడూ టీమిండియాతోనే ఉండరు: రోహిత్‌ శర్మ

Rohit Sharma says BCCI focus On Team India Bench Strength. భవిష్యత్తులో వన్డేలు ప్రభ కోల్పోతున్నాయని అనడంలో ఎలాంటి అర్థం లేదని టీమిండియా కెప్టెన్ రోహిత్‌ శర్మ అన్నాడు.   

Written by - P Sampath Kumar | Last Updated : Aug 18, 2022, 03:25 PM IST
  • అవన్నీ అర్థం లేని మాటలే
  • బుమ్రా, షమీ ఎప్పుడూ టీమిండియాతోనే ఉండరు
  • వన్డేలతోనే మంచి గుర్తింపు వచ్చింది
Rohit Sharma: అవన్నీ అర్థం లేని మాటలే.. బుమ్రా, షమీ ఎప్పుడూ టీమిండియాతోనే ఉండరు: రోహిత్‌ శర్మ

Rohit Sharma about ODI Format: భవిష్యత్తులో వన్డేలు ప్రభ కోల్పోతున్నాయని అనడంలో ఎలాంటి అర్థం లేదని టీమిండియా కెప్టెన్ రోహిత్‌ శర్మ అన్నాడు. ఏ ఫార్మాట్‌ అయినా చివరి దశకు చేరుకోదన్నాడు. జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ షమీ లాంటి సీనియర్‌ బౌలర్లు ఎప్పటికీ జట్టుకు అందుబాటులో ఉండకపోవచ్చని.. అందుకే బెంచ్‌ను పటిష్ఠం చేసేందుకు ఉన్న మార్గాలపై జట్టు మేనేజ్‌మెంట్‌ దృష్టి పెట్టిందని రోహిత్ తెలిపాడు. ముంబైలో బుధవారం ఓ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న రోహిత్ పలు విషయాలపై స్పందించాడు. 

'భవిష్యత్తులో వన్డేలు ప్రభ కోల్పోతున్నాయని చెప్పడంలో ఎలాంటి అర్థం లేదు. గతంలో టెస్టులు కూడా ప్రమాదంలో పడ్డాయనే అభిప్రాయాలు వినిపించాయి. కానీ టెస్ట్ క్రికెట్ ఇప్పుడు చాలా బాగుంది. వన్డేలు కూడా అంతే. నా వరకు క్రికెట్‌ ముఖ్యం. ఏ ఫార్మాట్‌ అయినా చివరి దశకు చేరుకుంటాయని నేను అనుకోను. మరో కొత్త ఫార్మాట్ వచ్చినా కూడా క్రికెట్ బాగుంటుంది. నాకు వన్డేలతోనే మంచి గుర్తింపు వచ్చింది. అయితే ఏ ఫార్మాట్‌లో ఆడాలి, ఏ ఫార్మాట్‌లో ఆడొద్దు అనేది ఆటగాడు తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది' అని రోహిత్ శర్మ అన్నాడు. 

'జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ షమీ లాంటి బౌలర్లు ఎప్పుడూ టీమిండియాతోనే ఉండరు. అందుకే ఇతర ఆటగాళ్లను కూడా సిద్ధం చేసుకోవాలి. బెంచ్‌ను ఎలా పటిష్ఠం చేయాలన్న మేనేజ్మెంట్ చర్చలు జరుపుతుతోంది. ఎక్కువ మ్యాచ్‌లు, గాయాల వంటివి ఎదురైనప్పుడు బెంచ్‌ బలంగా ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. 2-3 ఆటగాళ్లపై ఆధారపడే జట్టుగా మేం ఉండకూడదనుకుంటున్నాం. సమష్టిగా గెలవాలనుకుంటున్నాం. యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు కల్పించేలా ప్రయత్నాలు చేస్తున్నాం. సీనియర్లతో ఆడితే వారూ నేర్చుకుంటారు. జింబాబ్వే సిరీస్‌ యువజలకు మంచి అవకాశం' అని భారత కెప్టెన్ రోహిత్ పేర్కొన్నాడు. 

Also Read: IND vs ZIM: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. చహర్ వచ్చేశాడు! కీపర్ ఎవరంటే

Also Read: Viral Video: రెచ్చిపోయిన ప్రేమోన్మాది..  ప్రేమను ఒప్పుకోలేదని నడి రోడ్డుపైనే యువతిపై కాల్పులు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News