Niharika Konidela Haldi Ceremony | మెగా డాటర్, టాలీవుడ్ నటి నిహారిక కొణిదెల పెళ్లి వేడుక మరికొన్ని గంటల్లో జరగనుంది. అల్లు ఫ్యామిలీ, చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ మెగా బ్రదర్స్ కుటుంబసభ్యులతో ఒకేచోట కలిసి ఉండటంతో పండుగ వాతావరణం కనిపిస్తోంది. పెళ్లి వేడుకలో భాగంగా మంగళవారం నిహారిక మెహందీ వేడుక నిర్వహించారు. సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చాక మెగా ఫ్యామిలీ సభ్యులు మరింత ఆనందంగా పెళ్లి వేడుకలలో పాల్గొంటున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


తాజాగా నిహారిక (Niharika Konidela) హల్దీ వేడుక సైతం నిర్వహించారు. వరుణ్ తేజ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయిధరమ్ తేజ్ సహా మెగా యూత్ సంబరాలలో పాల్గొన్నారు. నిహారిక, చైతన్యల హల్దీ వేడుక ఫొటోలు సైతం బయటకు వచ్చాయి. పెళ్లి వేడుక ఎక్కడ జరిగితేనేం అభిమానం ఉంటే అన్నీ తెలుసుకోవచ్చునంటూ టాలీవుడ్ (Tollywood) మెగా ఫ్యాన్స్ ఈ ఫొటోలను తమ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తున్నారు.


Photos: Niharika Wedding Celebration Photos: నిహారిక పెళ్లి వేడుకల్లో బాబాయ్ పవన్ కళ్యాణ్ సందడి షురూ



పసుపు పచ్చని చీర, తెల్లటి జాకెట్ ధరించిన నిహారిక నమస్తే అంటే చేతులు జోడించిన ఫొటో వైరల్ అవుతోంది. మరో ఫొటోలో ముఖానికి పసుపుతో పెళ్లి సంబరాన్ని చూపించింది. ఇటీవల చైతన్య, నిహారిక నిశ్చితార్థం ఇరుకుటుంబసభ్యులు నిర్వహించారు. తాజాగా పెళ్లికి శుభముహూర్తం నిశ్ఛయించారు.
Gallery: Niharika Wedding: రాజస్థాన్‌లో నిహారిక పెళ్లి సందడి షురూ 


 




ఉదయపూర్‌లోని ఉదయ్ విలాస్ వేదికగా నిహారిక, చైతన్య వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. నేటి రాత్రి 7 గంటల 15 నిమిషాలకు గుంటూరు మాజీ ఐజీ జె.ప్రభాకర్ రావు తనయుడు వెంకట చైతన్యతో నిహారిక వివాహం జరగనుంది. ఇరు కుటుంబాల సన్నిహితులు సైతం ఈ వేడుకకు హాజరుకానున్నారు. 


Also Read: Chiranjeevi About Niharika Wedding: చిన్నారి నిహారిక అంటూ చిరంజీవి ఎమోషనల్ ట్వీట్ 


 




స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook