Nitesh Tiwari Ramayan: ప్రస్తుతం రామాయణం ఇతివృత్తం నేపథ్యంలో ఉన్న సినిమాలు సినీ పరిశ్రమలో ట్రెండ్‌ అవుతున్నాయి. ప్రభాస్‌ ఆదిపురుష్‌, ప్రశాంత్‌ వర్మ 'హను మాన్‌' చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మారథం పట్టారు. ఇప్పుడు బాలీవుడ్‌లో నితేశ్‌ తివారీ దర్శకత్వంలో మరో రామాయణ గాథ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో స్టార్‌ నటులు రణ్‌బీర్‌ కపూర్‌, యశ్‌, సీతాదేవిగా సాయి పల్లవి నటిస్తున్నారు. మరో కీలక పాత్ర కోసం నటుడి అన్వేషణ సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే మన జాతిరత్నం నవీన్‌ పోలిశెట్టిని ఖాయం చేసుకున్నారని తెలుస్తోంది. రామాయణం గాథలో కీలకమైన పాత్రకు నవీన్‌ను పరిశీలిస్తున్నారని సమాచారం.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Fake Accounts: విద్యా బాలన్‌కు తలనొప్పి.. విసుగెత్తి పోలీసులను ఆశ్రయించిన లేడీ సూపర్‌స్టార్‌


రాముడి పాత్రలో రణ్‌బీర్‌ కపూర్‌, సీతాదేవి పాత్రలో సాయి పల్లవి, రావణుడి పాత్రలో యశ్‌ పక్కాగా సెట్టయ్యారు. ఇక రాముడి వెన్నంటి ఉండే లక్ష్మణుడి పాత్రకు నవీన్‌ పోలిశెట్టి సరితూగుతాడని చిత్రబృందం భావిస్తోంది. ఈ క్రమంలోనే నవీన్‌తో చిత్రబృందం సంప్రదింపులు జరుపుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. లక్ష్మణ్‌ పాత్రకు నవీన్‌ పూర్తిగా సెట్‌ అవుతాడని దర్శకుడు నితేశ్‌ తివారీ భావిస్తున్నారు. ఈ సందర్భంగా నవీన్‌ లుక్స్‌ టెస్ట్‌ తర్వాత లక్ష్మణ్‌ పాత్రపై పూర్తి స్పష్టత రానుంది.

Also Read: Keeda Cola: కీడా కోలాకు 'ఏఐ' దెబ్బ.. ఎస్పీబీ వాయిస్‌ వాడుకున్నందుకు రూ.కోటి చెల్లించాల్సిందే


తెలుగు వారి కన్నా ముందే హిందీ సినీ పరిశ్రమకు నవీన్‌ పోలిశెట్టి పరిచయం. మొదట పలు హిందీ సీరియల్స్‌లో నటించిన నవీన్‌ అనంతరం షార్ట్‌ ఫిల్మ్స్‌ కూడా చేశాడు. ఇక తెలుగులో 'ఏజెంట్‌ శ్రీనివాస ఆత్రేయ' సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. అనంతరం కరోనా సమయంలో జాతిరత్నాలతో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నాడు. వీటన్నిటిని పరిశీలించిన నితేశ్‌ తివారీ నవీన్‌ను లక్ష్మణుడి పాత్ర కోసం అడుగుతున్నారని సమాచారం. నితేశ్‌ తివారీ దర్శకత్వంలో 2019లో వచ్చిన 'చిచ్చోరా' సినిమాలో నవీన్‌ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అప్పుడు నవీన్‌ నటన.. అతడి ప్రవర్తన చూసిన నితేశ్‌ లక్ష్మణుడి పాత్రకు అతడే న్యాయం చేస్తాడని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 


రామాయణం సినిమాకు ఎంపికైతే నవీన్‌ సరికొత్త పాత్రలో కనిపించనున్నాడు. తనదైన కామెడీ నటనను పక్కనపెట్టి పూర్తి బాధ్యతాయుతమైన పాత్రలో నవీన్‌ మెరిసే అవకాశం ఉంది. ఈ సినిమాలో కనుక నటిస్తే నవీన్‌ జీవితంలో మరుపురాని చిత్రం, పాత్రగా మారనుంది. పాత పరిచయాల నేపథ్యంలో వచ్చిన అవకాశాన్ని నవీన్‌ సద్వినియోగం చేసుకునే అతడి కెరీర్‌లో 'రామాయణం' భారీ సినిమా కానుంది. ప్రీ ప్రొడక్షన్‌ పనులు పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా మార్చిలో సెట్స్‌పైకి వెళ్తుందని సమాచారం. కాగా 'రామాయణం' సినిమాను మూడు భాగాలు చిత్రీకరిస్తున్నారని బాలీవుడ్‌లో వార్త చక్కర్లు కొడుతోంది. త్వరలోనే సినిమాకు సంబంధించిన విషయాలు చిత్రబృందం వెల్లడించనుంది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి