SP Charan Notice To Keedaa Cola Movie Team: తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన 'కీడా కోలా' చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు థియేటర్‌లో, ఓటీటీలో హవా కొనసాగించింది. హాస్యంతో కూడిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించారు. సినిమా విజయం పరంగా సరేగానీ వివాదంలో చిక్కుకుంది. సినిమాలో చేసిన ప్రయోగం బెడిసికొట్టింది. ఆ ప్రయోగం కాస్త సినిమా బృందానికి తలనొప్పిగా మారింది. ఫలితంగా ఇప్పుడు భారీ ఎత్తున నష్ట పరిహారం చెల్లించుకోవాల్సిన పరిస్థితి.
Also Read: Fake Accounts: విద్యా బాలన్‌కు తలనొప్పి.. విసుగెత్తి పోలీసులను ఆశ్రయించిన లేడీ సూపర్‌స్టార్
కీడాకోల సినిమాలో ప్రముఖ గాయకుడు దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వాయిస్‌ను వినియోగించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సహాయంతో ఎస్పీబీ వాయిస్‌ను రీ క్రియేట్ చేసి సినిమాలో వాడుకున్నారు. ఇది తెలుసుకున్న ఎస్పీబీ కుమారుడు ఎస్పీ చరణ్ న్యాయ పోరాటానికి దిగారు. తన తండ్రి వాయిస్‌ను అనుమతి లేకుండా వాడుకున్నందుకు చిత్ర నిర్మాతతోపాటు సంగీత దర్శకుడు వివేక్ సాగర్‌లకు నోటీసులు పంపించారు. ఈ విషయంలో ఎస్పీ చరణ్ ఆల్టిమేట్టం కూడా జారీ చేసినట్లు సమాచారు.
Also Read: Varun Tej: హీరో వరుణ్ తేజ్ 'రాజకీయాలపై' సంచలన ప్రకటన.. నాన్న చెబితే బాబాయ్‌కి ప్రచారం చేస్తా
ఈ వివాదంపై ఎస్పీ చరణ్ తరఫున న్యాయవాది మాట్లాడారు. 'అనుమతి లేకుండా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వాయిస్‌ను వినియోగించుకున్న కీడా కోలా బృందం క్షమాపణ చెప్పాల్సిందే. దాంతోపాటు రూ.కోటి నష్ట పరిహారం, రాయల్టీలో షేర్ కూడా ఇవ్వాలి' అని తెలిపారు. అయితే ఈ వివాదంపై ఇప్పటివరకు చిత్రబృందం స్పందించలేదు. దర్శకుడు తరుణ్ భాస్కర్, నిర్మాత ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.
కూల్‌డ్రింక్‌లో బొద్దింక పడిన సంఘటనపై కీడా కోలా సినిమా ఉంది. ఈ చిత్రంలో బ్రహ్మానందం, చైతన్య రావు, రాగ్ మయూర్ ప్రధాన పాత్రల్లో నటించారు. హాస్యకథా నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమాను దగ్గుబాటి రానా సమర్ఫణలో రూపుదిద్దుకుంది. నవంబర్ 3వ తేదీన విడుదలై విజయం సాధించింది. ఈ సినిమా ఆహా ఓటీటీలో కూడా విడుదలై ప్రేక్షకులకు నవ్వులు తెప్పిస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Keeda Kola: కీడా కోలాకు 'ఏఐ' దెబ్బ.. ఎస్పీబీ వాయిస్ వాడుకున్నందుకు రూ.కోటి చెల్లించాల్సిందే