Fake Accounts: విద్యా బాలన్‌కు తలనొప్పి.. విసుగెత్తి పోలీసులను ఆశ్రయించిన లేడీ సూపర్‌స్టార్‌

Vidya Balan Fake Instagram Account: ప్రముఖుల పేర్లతో సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. వారి పేరిట సామాజిక మాధ్యమాల్లో ఖాతాలు తెరచి డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్నారు. తాజాగా లేడీ సూపర్‌స్టార్‌గా గుర్తింపు పొందిన ప్రముఖ హీరోయిన్‌ విద్యా బాలన్‌ కూడా ఇలాంటి పరిస్థితిని ఎదురైంది. వారితో విసుగెత్తి చివరకు పోలీసులను ఆశ్రయించింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 21, 2024, 08:04 PM IST
Fake Accounts: విద్యా బాలన్‌కు తలనొప్పి.. విసుగెత్తి పోలీసులను ఆశ్రయించిన లేడీ సూపర్‌స్టార్‌

Vidya Balan Fake Account: సినిమా పరిశ్రమ ప్రముఖులకు సామాజిక మాధ్యమాల ద్వారా వేధింపులు ఎదురవుతున్నాయి. తరచూ వేధింపులు ఎదురవుతుండడంతో కొందరు ప్రముఖులు సోషల్‌ మీడియాకు దూరంగా ఉంటున్న పరిస్థితి. తాజాగా ప్రముఖ హీరోయిన్‌ విద్యా బాలన్‌ అలాంటి పరిస్థితే ఎదుర్కొన్నారు. తన పేరిట జరుగుతున్న మోసాలపై విసుగెత్తి పోలీసులను ఆశ్రయించారు. తన పేరుతో జరుగుతున్న మోసాలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. సోషల్‌ మీడియాలో తన పేరిట ఖాతాలు తెరచి అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని వాపోయారు. అలాంటి నిందితులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

Also Read: Wife Filed Case: పెళ్లయి రెండేళ్లయినా మా మధ్య 'ఏం' జరగలేదు..? భర్తపై కేసు వేసిన భార్య

బాలీవుడ్‌తోపాటు ఇతర భాషల్లో కూడా విద్యా బాలన్‌కు అభిమానులు భారీగా ఉన్నారు. లక్షలాది మంది ఆమెను అభిమానిస్తున్నారు. ఆమెకు ఉన్న ఫేమ్‌ను కొందరు దుండగులు సొమ్ము చేసుకోవాలని భావించారు. విద్యా బాలన్‌ పేరిట నకిలీ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా తెరిచారు. ఆ ఖాతా ద్వారా ప్రజల నుంచి డబ్బులు వసూల్‌ చేయడం ప్రారంభించారు. అంతటితో ఆగకుండా విద్యా బాలన్‌ పేరు మీద ఈమెయిల్‌ కూడా తెరిచారు. ఆ మెయిల్‌ ద్వారా చాలా మందికి సందేశం పంపారు.

Also Read: Movie Chance Fraud: సినిమా ఛాన్స్‌ల పేరిట తన 'కోరికలు' తీర్చుకుని మోసం చేసిన నటుడు

డబ్బులు కావాలని కోరుతూ విద్యాబాలన్‌ పేరిట సందేశం రావడంతో అందరూ అవాక్కయ్యారు. అంతేకాకుండా ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి కూడా డబ్బులు దండుకుంటున్నారు. అయితే ఇదే సందేశం ఓ కాస్ట్యూమ్‌ డిజైనర్‌కు కూడా మెయిల్‌ ద్వారా వచ్చింది. ఈ విషయాన్ని విద్యా బాలన్‌కు తెలిపారు. వెంటనే అప్రమత్తమైన హీరోయిన్‌ విద్యా బాలన్‌ పోలీసులను ఆశ్రయించారు. విద్యా బాలన్‌ ఫిర్యాదును స్వీకరించిన ఖర్‌ పోలీస్‌స్టేషన్‌ అధికారులు వెంటనే రంగంలోకి దిగారు.

విద్యా బాలన్‌ పేరిట అకౌంట్‌ తెరచి డబ్బులు దండుకుంటున్న నిందితుడిని గుర్తించే పనిలో పోలీసులు పడ్డారు. నకిలీ ఇన్‌స్టాగ్రామ్‌ రూపొందించిన కంప్యూటర్‌ ఐపీ అడ్రస్‌ను కనుకునే పనిలో పడ్డారు. ఐపీ అడ్రస్‌ ద్వారా నిందితుడి ఆచూకీ కోసం ఆరా తీస్తున్నారు. ముంబైలో ఇలాంటి మోసాలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. సెలబ్రిటీల పేర్లను వాడుకుని దండుకుంటున్న బ్యాచ్‌ భరతం పట్టేందుకు ముంబై పోలీసులు ప్రత్యేక బృందం ఏర్పాటు చేసినట్లు సమాచారం.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News