Adipurush: ఆదిపురుష్ చిత్రంలో శివుడి పాత్రపై ఆసక్తికరమైన అప్డేట్
బాహుబలి ( Baahubali ), సాహో చిత్రాలతో జాతీయ స్థాయిలో మంచి పేరు, అదిరిపోయే పాపులారిటీ సంపాదించుకున్నాడు ప్రభాస్ ( Prabhas ).
బాహుబలి ( Baahubali ), సాహో చిత్రాలతో జాతీయ స్థాయిలో మంచి పేరు, అదిరిపోయే పాపులారిటీ సంపాదించుకున్నాడు ప్రభాస్ ( Prabhas ). అందుకే వరుసగా ప్యాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం రాధేశ్యామ్ చిత్రీకరణలో భాగంగా ఇటలీలో ఉన్నాడు ప్రభాస్. దాంతో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. అదే సమయంలో టీసిరీస్ నిర్మిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ఆదిపురుష్ గురించి రోజుకో కొత్త విషయం తెలుస్తోంది.
Also Read: పెళ్లికి ముందు Virat Kohli డేటింగ్ చేసిన ఆ బ్యూటీస్ ఎవరో తెలుసా?
ఆదిపురుష్ ( Adipurush ) చిత్రంలో ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటించనున్నాడు. ఇప్పటికే రావణుడి పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఎంపికయ్యాడు. అయితే ఈ చిత్రంలో మహాశివుడి పాత్ర గురించి ఇప్పడు ఒక ఆసక్తికరమైన అప్డేట్ ట్రెండ్ అవుతోంది.
ఈ మూవీలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గన్ శివుడి పాత్రలో కనిపించనున్నాడు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ఏ మాత్రం నిజం ఉందో అనేది తెలియదు. అయితే దీనిపై అక్టోబర్ 23వ తేదీన అంటే ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
ALSO READ | Prabhas Updates: బిగ్ బీ పాత్ర పేరే ప్రభాస్ మూవీ టైటిల్…నాగ్ అశ్విన్ క్లారిటీ
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR