Telugu OTT Releases This Week: వారసుడు, వీరసింహారెడ్డి సహా ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలివే!
Telugu OTT Releases This Week: ఈ వారం థియేటర్లలో పెద్ద సినిమాలు విడుదలవడం లేదు, కానీ గతంలో విడుదలైన పెద్ద సినిమాలు ఓటీటీకి వస్తున్నాయి, ఆ వివరాలు
OTT Releases This Week in Telugu : ఈ వారం థియేటర్లలో పెద్ద సినిమాలు విడుదలవడం లేదు, కానీ గతంలో విడుదలైన పెద్ద సినిమాలు ఓటీటీకి వస్తూ ఉండడం ఆసక్తికరంగా మారింది. ముందుగా వీర సింహారెడ్డి సినిమా ఈరోజు ఫిబ్రవరి 23వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించింది.
దునియా విజయ్ కుమార్ విలన్ గా నటించిన సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో నటించింది. ఇక బాలకృష్ణ సరసన హనీ రోజ్, శృతిహాసన్ హీరోయిన్లుగా నటించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమా కేవలం తెలుగు భాషలోనే కాదు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సైతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో అందుబాటులోకి రాబోతోంది. ఇక మరో పక్క వారసుడు సినిమా కూడా ఇదే రోజు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. విజయ్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.
తెలుగు, తమిళ, మలయాళ, భాషల్లో ఈ సినిమా ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమ్ కాబోతోంది. ఈ సినిమాకి సంబంధించిన హిందీ వర్షన్ మాత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో మార్చి 8వ తేదీ నుంచి అందుబాటులోకి రాబోతోంది. ఇక జీ5 లో మరో ఆసక్తికరమైన వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
పులి మేక పేరుతో ఈ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 24వ తేదీ నుంచి జి5 యాప్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఆది సాయికుమార్, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రధారులుగా ఈ వెబ్ సిరీస్ రూపొందింది. ఇక తెలుగు నుంచి ఉన్నవి ఈ వెబ్ సిరీస్ లు సినిమాలే అయినా ఇతర భాషలకు సంబంధించి అనేక సినిమాలు వెబ్ సిరీస్ లు కూడా ఓటీటీలోకి రాబోతున్నాయి.
Also Read: Ram Charan Removed Ayyappa Mala: అమెరికాలో రామ్ చరణ్ అయ్యప్ప మాల తీశేశాడా? అసలు ఏమైందంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook