Ram Charan Ayyappa Mala Rules: రామ్ చరణ్ మాలలో ఉండి చెప్పులు ధరించాడా? అసలు అయ్యప్ప మాల నియమాలు తెలుసా?

Ayyappa Mala Rules: రామ్ చరణ్ తేజ అమెరికాకి అయ్యప్ప మాలధారణ చేసి వెళ్లడం ఆ తర్వాత మాలధారణలో  కనిపించకపోవడంతో  అయ్యప్ప నియమాల గురించి చర్చ జరుగుతోంది, ఆ వివరాలు

Written by - Chaganti Bhargav | Last Updated : Feb 23, 2023, 05:48 PM IST
  • రామ్ చరణ్ మాలలో ఉండి చెప్పులు ధరించాడా?
  • అసలు అయ్యప్ప మాల నియమాలు తెలుసా?
  • అయ్యప్ప మాల నియమాలు మీకోసం
Ram Charan Ayyappa Mala Rules: రామ్ చరణ్ మాలలో ఉండి చెప్పులు ధరించాడా? అసలు అయ్యప్ప మాల నియమాలు తెలుసా?

Can a person Wear Foot wear in Ayyappa Mala: రామ్ చరణ్ తేజ అమెరికాకి అయ్యప్ప మాలధారణ చేసి వెళ్లడం ఆ తర్వాత మాలధారణలో  కనిపించకపోవడంతో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే అమెరికాలో షో కోసమే నల్లని దుస్తులు పక్కన పెట్టి ఆ షో కి సంబంధించి కొద్దిసేపు మాత్రం సూటు బూట్లో ఆయన కనిపించినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అయ్యప్ప మాల అంటే ఏమిటి అనే విషయం మీద దేశవ్యాప్తంగా ప్రజలు దృష్టి సారిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.

వాస్తవానికి అయ్యప్ప మాల ధారణ గురించి అయ్యప్ప మాల నియమాల గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు కేరళ, తమిళనాడు, కర్ణాటక ప్రజలకు కూడా అవగాహన ఉంటుంది. కానీ ఉత్తరాది వారికి మాత్రం ఈ విషయం మీద కాస్త అవగాహన తక్కువే అయితే అయ్యప్ప మాలధారణ గురించి మీ ముందుకు కొన్ని విషయాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఈ అయ్యప్ప దీక్ష అనేది అయ్యప్ప స్వామి భక్తులు చాలా నిష్టగా శ్రద్ధగా 41 రోజులపాటు తీసుకుంటూ ఉంటారు.

కేరళలోని శబరిమలలో కొలువై ఉన్న అయ్యప్ప స్వామి కోసం 41 రోజులు నిష్టతో నియమాలతో మాల ధారణ చేసి ఆయనను పూజించేందుకు అక్కడికి వెళతారు. ఈ 41 రోజుల పాటు అయ్యప్ప భక్తులు ఏకభుక్తం ఉంటారు, రెండవ పూట అల్పాహారం మాత్రమే చేస్తూ ఉంటారు 41 రోజుల పాటు క్రమం తప్పకుండా నల్లటి దుస్తులు మాత్రమే ధరిస్తారు. ఆ దుస్తులు వారే స్వయంగా ఉతుక్కోవాల్సి ఉంటుంది.  ఈ అయ్యప్ప మాలధారణలో ఉన్నప్పుడు గడ్డాలు మీసాలు, జుట్టు కత్తిరించడం లాంటివి చేయకూడదు కనీసం గోళ్లు కూడా కత్తిరించకూడదు. నిరంతరం స్వామియే శరణమయ్యప్ప అనే మంత్రధారణను మనసులో స్మరిస్తూ ఉండాలి. ఇక ఈ 41 రోజులపాటు కాళ్లకు ఎలాంటి ఆచ్ఛాదనా లేకుండానే నడవాలి. సాధారణంగా 41 రోజులను మండలం అంటారు, ఈ మండల దీక్షను నవంబర్ 16వ తేదీ నుంచి డిసెంబర్ 27వ తేదీ లోపు ముగిసేలా స్వీకరిస్తూ ఉంటారు. ఎందుకంటే అప్పుడు మండల పూజల కోసం ఆలయాన్ని తెరిచి ఉంచుతారు.

ఇక ప్రతినెల ఐదు రోజులపాటు అయ్యప్ప ఆలయాన్ని తెరిచి భక్తులకు పూజల కోసం అనుమతిస్తున్న నేపథ్యంలో కొంతమంది ఇతర సమయాల్లో కూడా మాలధారణ చేస్తున్నారు. ఇప్పుడు కూడా రామ్ చరణ్ తేజ అలాగే మాలధారణ చేశారు. ఇక ఒకప్పుడు మాలధారణ చేసి విరమణ చేయాలంటే కచ్చితంగా శబరిమల ఆలయాన్ని సందర్శించాలని చెబుతూ ఉండేవారు కానీ ఇప్పుడు హైటెక్ పద్ధతులు వచ్చేసిన నేపథ్యంలో నియమ నిష్టలు కూడా తెలియని గురుస్వాముల ఆధ్వర్యంలో మహాలధారణ చేస్తున్న కొంతమంది భక్తులు ఇతర ప్రాంతాలలో ఏర్పాటు చేసిన దేవాలయాలకు వెళ్లి అక్కడ మాల విరమణ చేస్తున్న ఘటనలో ఎక్కువయ్యాయి. వాస్తవానికి అయ్యప్ప మాలధారణ అంటే గురుస్వామి చేత మంత్రోపదేశంతో మాలధారణ చేసుకొని గురుస్వామితో పాటుగా శబరి యాత్ర చేయాల్సి ఉంటుంది. శబరి యాత్ర పూర్తి చేసుకున్న తర్వాత నెయ్యాభిషేకం చేయించి ఆ నేతితో ఇంటికి వచ్చి పాయసం వండుకొని తాను తిని కుటుంబ సభ్యులకు తినిపించి ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి తినిపించిన తర్వాత మాల విరమణ చేయాలి. 

Also Read: Ram Charan Removed Ayyappa Mala: అమెరికాలో రామ్ చరణ్ అయ్యప్ప మాల తీశేశాడా? అసలు ఏమైందంటే?

Also Read:  Kajal Aggarwal Diet Secrets: పెళ్లైనా అదిరే అందాలతో కాజల్ అగర్వాల్... అసలు సీక్రెట్స్ ఇవా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 
 

Trending News