Pawan Kalyan doing the same mistake like Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , ఈ ఇద్దరి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అసలు ఏ మాత్రం సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలో ఎంటర్ అయిన మెగాస్టార్ చిరంజీవి ఈరోజు అనేక మందికి తాను ఒక రోల్ మోడల్ గా నిలిచారు. ఇక అన్న వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన తనకంటూ సపరేట్ క్రేజ్ ఏర్పరుచుకున్నాడు పవన్ కళ్యాణ్.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒక రకంగా చిరంజీవి రాజకీయ ఆరంగ్రేటం చేసి సినిమాలకు గుడ్ బై చెప్పి పూర్తిగా రాజకీయాలకే పరిమితం అవుతానని చెప్పినా అది వర్కౌట్ కాకపోవడంతో సినీ రీ ఎంట్రీ ఇచ్చి సినిమాలు చేస్తున్నారు, పవన్ కూడా రెండు పడాల మీద కాలు వేస్తూ ఒకపక్క సినిమాలు మరో పక్క రాజకీయాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే అన్న చేసిన తప్పే తమ్ముడు కూడా చేయడానికి సిద్ధమవుతున్నారనే ప్రచారం ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో జరుగుతోంది, పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్లో భవదీయుడు భగత్ సింగ్ అనే ఒక సినిమా ప్రకటించారు.


ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ కూడా అప్పట్లో రిలీజ్ చేశారు గాని సినిమా షూటింగ్ గురించి ఎలాంటి అప్డేట్ బయటకు రావడం లేదు. తాజాగా టాలీవుడ్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు ఈ సినిమా నిలిపివేయాలని యూనిట్ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. దాని స్థానంలో విజయ్ హీరోగా నటించిన తేరి అనే సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. నిజానికి ఈ తేరి సినిమాని తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. ప్రస్తుతానికి ఓటీటీలో కూడా అందుబాటులో ఉంది.


ఒక రకంగా ఇలాంటి సినిమా చేయడం అనేది చాలా రిస్క్ తో కూడిన వ్యవహారం. పవన్ కళ్యాణ్ గతంలో కూడా కాటమరాయుడు సినిమాని ఇదే విధంగా చేసి చేతులు కాల్చుకున్నారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి కూడా గాడ్ ఫాదర్ పేరుతో అదే తప్పు చేశారు. గాడ్ ఫాదర్ సినిమాకి ఒరిజినల్ కంటే బావుందనే టాక్ వచ్చినా సరే దానికి తగ్గ కలెక్షన్స్ మాత్రం రాబట్టలేకపోయింది. ఇప్పుడు అన్నయ్య చిరంజీవి చేసిన తప్పిదాన్ని చూసిన పవన్ కళ్యాణ్ ఈ విషయంలో జాగ్రత్త పడాలి కానీ మళ్ళీ తెలుగులో అందుబాటులో ఉన్న డబ్బింగ్ సినిమాను ఇప్పుడు రీమేక్ చేయడానికి ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారు అంటూ పలువురు విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.


నిజానికి కరోనా లాక్ డౌన్ లో తెలుగు ప్రేక్షకులు ఇతర భాషలు సినిమాలకు బాగా ఎక్స్పోజ్ అయిన నేపథ్యంలో ఇప్పుడు ఎలాంటి సినిమా వారి ముందుకు తీసుకు వస్తున్నా వారిని మెప్పించడం కష్టమే అవుతుంది. ఈ నేపథ్యంలో కొత్తదనం ఉన్న కథలతో అలరించడానికి ప్రయత్నించాలి కానీ ఇప్పటికే చూసేసిన కథలను మళ్లీ తీసుకొస్తే లాభం ఉండదని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరి చూడాలి పవన్ కళ్యాణ్ ఈ విషయంలో వెనక్కి తగ్గుతారా లేక అదే తప్పు చేసి మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తారా అనేది?


Also Read: Prabhas - Maruthi Movie: సైలెంట్ గా పని కానిస్తున్న ప్రభాస్- మారుతి..ఎక్కడా తగ్గట్లేదుగా!


Also Read: Kalyan Ram Amigos: కళ్యాణ్ రామ్ కోసం అఖండ మ్యాజిక్.. మైత్రీ మేకర్స్ ప్లాన్ అదిరిందిగా!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook