Prabhas - Maruthi Movie: సైలెంట్ గా పని కానిస్తున్న ప్రభాస్- మారుతి..ఎక్కడా తగ్గట్లేదుగా!

Prabhas Maruthi Movie Shooting Update: ప్రభాస్ మారుతి కాంబినేషన్ మూవీ షూటింగ్ మొదలైనట్టు వార్తలు రాగా ఇప్పుడు ఏకంగా మొదటి షెడ్యూల్ షూట్ పూర్తయినట్టు తెలుస్తోంది. ఆ వివరాలు 

Written by - Chaganti Bhargav | Last Updated : Oct 28, 2022, 07:51 AM IST
Prabhas - Maruthi Movie: సైలెంట్ గా పని కానిస్తున్న ప్రభాస్- మారుతి..ఎక్కడా తగ్గట్లేదుగా!

Prabhas Maruthi Movie Firsht Schedule Completed: ఒక ప్రక్క ప్రభాస్ హీరోగా పలు భారీ ప్రాజెక్టులు తెరకెక్కుతుంటే మరోపక్క ఆయన సైలెంట్ గా చిన్న సినిమా ఒకటి చేస్తున్నారు. చాలా కాలంగా మారుతీ డైరెక్షన్లో ప్రభాస్ ఒక కామెడీ మూవీ చేయబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన ఓపెనింగ్ కూడా జరిగిందని షూటింగ్ మొదలుపెట్టారని వార్తలు వచ్చాయి. ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు కానీ ఇప్పుడు ఏకంగా మొదటి షెడ్యూల్ కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

మొదటి షెడ్యూల్ లో మొత్తం మూడు రోజులు పాటు ప్రభాస్ షూటింగ్ లో పాల్గొన్నారని అంటున్నారు. మిగతా నాలుగు రోజులు ప్రభాస్ లేకుండానే మిగతా నటీనటులపై కొన్ని సీన్స్ షూట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ప్రభాస్ తో కాంబినేషన్ సీన్లో రిద్ది కుమార్ అలాగే వైవా హర్ష అండ్ కో పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా ఒక హర్రర్ కామెడీ అని ప్రచారం జరుగుతుండగా ప్రభాస్ కు దెయ్యం పడుతుందని ఆ తరువాత వచ్చే ఫన్ ప్రధానంగా ఈ సినిమా మొత్తం సాగుతుందని అంటున్నారు.

ఇక మరోపక్క ప్రభాస్ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే ఆయన హీరోగా నటిస్తున్న ఆది పురుష్  సినిమా సంక్రాంతికి ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాని టి సిరీస్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్పిస్తోంది. మరోపక్క ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో రూపొందుతున్న సలార్ సినిమా ఏప్రిల్ నెలలో విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

హోంబలే ఫిలింస్ బ్యానర్ మీద ఈ సినిమాని విజయ్ కిరగందూర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. మరోపక్క నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ప్రభాస్ ప్రాజెక్ట్ కే అనే సినిమా చేస్తున్నారు. అశ్విని దత్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాలో దీపికా పడుకొనే అమితాబచ్చన్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో కనిపిస్తున్నారు. ఇక సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో ప్రభాస్ స్పిరిట్ అనే సినిమా అనౌన్స్ చేశారు కానీ ఆ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందనే విషయం మీద క్లారిటీ లేదు.

Also Read: Anchor Vishnu Priya: యాంకర్ విష్ణుప్రియ లేటెస్ట్ ఫొటోలు.. క్యూట్ లుక్స్‌తో పడేసిందిగా..

Also Read: Ram Gopal Varma Vyuham: పవన్ మూడు పెళ్లిళ్లు అసలు మ్యాటరే కాదు.. వర్మ ప్లాన్ అది కాదట?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News