Kalyan Ram Amigos: కళ్యాణ్ రామ్ కోసం అఖండ మ్యాజిక్.. మైత్రీ మేకర్స్ ప్లాన్ అదిరిందిగా!

Kalyan Ram Amigos Movie on December 2: కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందుతున్న అమిగోస్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసినట్టు చెబుతున్నారు, బాలయ్య అఖండ హిట్ కొట్టిన  డిసెంబర్ 2నే సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే 

Written by - Chaganti Bhargav | Last Updated : Oct 28, 2022, 09:50 AM IST
Kalyan Ram Amigos: కళ్యాణ్ రామ్ కోసం అఖండ మ్యాజిక్.. మైత్రీ మేకర్స్ ప్లాన్ అదిరిందిగా!

Kalyan Ram Amigos Movie to Release on December 2: నందమూరి కళ్యాణ్ రామ్ బింబిసార మూవీతో హిట్ కొట్టి ఎట్టకేలకు ఫామ్ లోకి వచ్చారు. ప్రస్తుతం ఆయన పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే కళ్యాణ్ రామ్ రెండు సినిమాల లైన్లో పెట్టారు. అందులో ఒకటి ఆయన 19వ సినిమా కాగా మరొకటి 20వ సినిమా. తాజాగా అందుతున్న సమాచారం మేరకు కళ్యాణ్ రామ్ 19వ సినిమా షూటింగ్ పూర్తి అయిందని త్వరలోనే దీన్ని విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందుతున్న నిజానికి ఈ సినిమా పూజా కార్యక్రమాలు గత ఏడాది ఫిబ్రవరి నెలలో జరిగాయి. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ ఒక ట్రిపుల్ రోల్ చేయబోతున్నాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక ఈ సినిమాకి అమిగోస్ అనే టైటిల్ కూడా ఖరారు చేశారు. అమిగోస్ అనేది ఒక స్పానిష్ పదం, స్నేహితుడిని ఉద్దేశించి మాట్లాడేందుకు ఈ పదాన్ని స్పానిష్ లో వాడుతూ ఉంటారు.

ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో పాటు దాదాపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి కావచ్చని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాని ఈ ఏడాది విడుదల చేయాలని రంగం సిద్ధం చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ ఏడాది బింబిసార సినిమాతో ఆయన హిట్ అందుకోవడంతో కళ్యాణ్ రామ్ మార్కెట్ కాస్త పెరిగింది. దీంతో డిసెంబర్ రెండో తేదీన సినిమాని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. గత ఏడాది డిసెంబర్ 2వ తేదీన నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ సినిమా విడుదలై సూపర్ హిట్ అయింది.

ఈ నేపద్యంలో బాబాయ్ సెంటిమెంట్ డేట్ ని అబ్బాయి కూడా ఫాలో అవుతున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ అమిగోస్ సినిమాకి రాజేంద్ర డైరెక్షన్ చేయగా మైత్రి మూవీ మేకర్ సంస్థ భారీ బడ్జెట్లో నిర్మించింది. ఇక ఈ సినిమా కాకుండా కళ్యాణ్ రామ్ డెవిల్ అనే మరో సినిమా చేస్తున్నాడు. బ్రిటిష్ కాలం నాటి ఒక కథ నేపథ్యంలో నవీన్ మేడారం ఈ సినిమా రూపొందిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ అమిగోస్ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన ఒకటి రెండు రోజుల్లో విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read: Prabhas - Maruthi Movie: సైలెంట్ గా పని కానిస్తున్న ప్రభాస్- మారుతి..ఎక్కడా తగ్గట్లేదుగా!

Also Read: Ram Gopal Varma Vyuham: పవన్ మూడు పెళ్లిళ్లు అసలు మ్యాటరే కాదు.. వర్మ ప్లాన్ అది కాదట?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News