కరోనావైరస్ ( Coronavirus ) మొదలైన తరువాత లాక్ డౌన్ వల్ల కాలు బయట పెట్టకుండ ప్రజలు అందరు ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రస్తుత పరిస్థితులు అలా రెస్టారెంట్లకు, బేకరీలకు, స్ట్రీట్ ఫుడ్స్ ( Street foods ) ఎంజాయ్ చేయడానికి వెళ్లే వీలులేకుండా తయారయ్యాయి. అలా బయటికి వెళ్లే వీలులేదు కనుక చాలా మంది యూట్యూబ్ కుకింగ్ చానల్స్ ఫాలో అవుతూ కేక్‌లు, పిజ్జాలు, బర్గర్లు వంటి జంక్ ఫుడ్స్ ( Junk foods ), ఇతర అనేక రకాల వంటలు ఇంట్లోనే చేసుకుంటున్నారు. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) - రేణు దేశాయ్ ( Renu Desai )ల గారాలపట్టి, 10 సంవత్సరాల పాప ఆద్య కూడా అలాగే యాపిల్ వీగన్ పైని ( కేక్ లాంటి ఒక పాశ్చాత్య వంటకం) అనే ఓ ప్రత్యేక వంటకాన్ని ట్రై చేసింది. ఆద్య తయారు చేసిన యాపిల్ వీగన్ పైని ( Apple Vegan pie ) రేణు దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి అందరి నోరూరేలా కామెంట్స్ రాసుకొచ్చింది. తన కూతురు పై తయారు చేస్తుంటే తను వంటగదిలోకి అడుగు కూడా పెట్టలేదు అని చెప్పుకొచ్చింది. Also read: Renu Desai: లగ్జరీ కార్లు అమ్మేస్తున్న రేణు దేశాయ్.. ఎందుకో తెలుసా ?



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వీగన్ డిజర్ట్‌లు సాధారణ డిజర్ట్‌ల మాదిరిగా మంచివి కావు అనే అపోహను కూడా ఆద్య పూర్తిగా కొట్టిపారేసేలా చేసిందని రేణు దేశాయ్ తన కూతురిని ఆకాశానికెత్తేసింది. ఆద్య చేసిన పైలో సగానిపైగా నేనే తిన్నాను అని చెబుతూ.. పరోక్షంగా ఆద్య చేసిన పై రుచి అమోఘం అని కామెంట్ చేసింది. ఆద్య వీగన్ చేయడానికి ఎంచుకోవడాన్ని చూసి తనకు ఎంతో గర్వంగా ఉందని.. ఆద్య పూర్తి శాఖాహారిగా ఉండటం గొప్ప విషయమని తన కూతురిని పొగడ్తల్లో ముంచెత్తింది. నా లిటిల్ ఏంజెల్‌ని ఆశీర్వదించండి అంటూ రేణు దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ యాపిల్ వీగన్ పై ఫోటోను షేర్ చేసింది. Also read: Viral video: పక్షులు ఇలా కూడా చేస్తాయా