Viral video: పక్షులు ఇలా కూడా చేస్తాయా ?

సీగల్ అనే పక్షి ( Seagull ) ఎక్కువగా సముద్ర ప్రాంతాల్లో కనిపిస్తుంటాయి. ఇవి బీచ్‌లో సరదాగా కాలక్షేపం చేయడానికి వచ్చిన వారి దగ్గర ఉండే చిరుతిండిని దొంగిలించడం వీటికి బాగా అలవాటు. అలా ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో వీటికి మంచి ఉదాహరణ అని చెప్పుకోవచ్చు.

Last Updated : Aug 11, 2020, 08:02 PM IST
Viral video: పక్షులు ఇలా కూడా చేస్తాయా ?

సీగల్ అనే పక్షి ( Seagull ) ఎక్కువగా సముద్ర ప్రాంతాల్లో కనిపిస్తుంటాయి. ఇవి బీచ్‌లో సరదాగా కాలక్షేపం చేయడానికి వచ్చిన వారి దగ్గర ఉండే చిరుతిండిని దొంగిలించడం వీటికి బాగా అలవాటు. అలా ఇటీవల సోషల్ మీడియాలో  వైరల్ అవుతున్న ఒక వీడియో వీటికి మంచి ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. ఐతే ఈ వీడియోలో పక్షి చిరుతిండిని దొంగిలించడానికి ఇంకా కొంచం మాస్టర్ ప్లానే వేసింది. అమాయకంగా ఎవరి ద్యాస దాని మీద పడకుండా మెల్లిగా షాప్‌లోకి దూరి అక్కడ ర్యాక్‌లో ఉన్న చిప్స్ ప్యాకెట్ అందుకొని ( Shop lifter ) అతివేగంతో పరుగుతీసి తుర్రుమంది. Also read: యాపిల్ వీగన్ పై తయారు చేసిన పవన్ కల్యాణ్ కూతురు ఆద్య

note the casual entry and hurried exit
this is an experienced seagull shoplifter pic.twitter.com/WnIOkIsqfK

— btw there's still a pandemic 💣 (@ziyatong) August 8, 2020

మొదటగా టంబ్లర్ ( Tumblr )లో షేర్ చేసిన ఈ వీడియో ట్విట్టర్‌లోకి అడుగుపెట్టిన తర్వాత వైరల్ కావడం ప్రారంభమైంది. దీనిని టెలివిజన్ సెలెబ్రిటీ అయిన జియ టాంగ్ "ఈ పక్షి తెలివిగా ఎలా దొంగతనం చేసిందో  చూడండి" అనే క్యాప్షన్‌తో ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఇప్పటికే ఈ వీడియో 5.2 మిలియన్ వ్యూస్‌ని సొంతం చేసుకోగా 4 లక్షలకు పైగా లైక్‌లను సంపాదించుకుంది. Also read: Renu Desai: లగ్జరీ కార్లు అమ్మేస్తున్న రేణు దేశాయ్.. ఎందుకో తెలుసా ?

Trending News