Project K Update: డార్లింగ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఆ వేడుకలోనే `ప్రాజెక్టు-కే` టైటిల్ రివీల్..
Project K Update: రెబల్ స్టార్ ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కతున్న సినిమా `ప్రాజెక్టు-కే`. అయితే ఏ తెలుగు సినిమాకు లభించని గౌరవం ఈ మూవీకి దక్కనుంది. అదేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా...
Prabhas Project K Update: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లీడ్ రోల్ చేస్తున్న భారీ బడ్జెట్ మూవీ ప్రాజెక్టు-కే. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశాపటానీ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్ డేట్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. అదేంటంటే..తాజాగా ఈ చిత్రానికి అంతర్జాతీయ వేదికగా ఓ అరుదైన గౌరవం దక్కనుంది.
జూలై 19 నుంచి అమెరికాలో శాన్ డియాగో కామిక్-కాన్ వేడుక జరగనుంది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ప్రాజెక్టు-కేకు సంబంధించిన అప్డేట్స్ ను రివీల్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇందులో భాగంగానే టైటిల్, రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారు. జూలై 20న జరగనున్న వేడుకల్లో ప్రాజెక్టు-కే టీమ్ పాల్గొననుంది. అక్కడ 'దిజ్ ఈజ్ ప్రాజెక్టు కే ఫస్ట్ గ్లింప్స్ ఆఫ్ ఇండియాస్ మైథో-సైన్స్ ఫిక్షన్ ఎఫిక్' అనే పేరుతో ఓ ప్యానెల్ ను హోస్ట్ చేసి ఇందులో ప్రాజెక్టు-కే ఫస్ట్ గ్లింప్స్, టైటిల్, సినిమా రిలీజ్ డేట్ ను చిత్ర యూనిట్ రివీల్ చేయనుంది.
ఈ కార్యక్రమానికి ప్రభాస్, దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, నాగ్ అశ్విన్, అశ్వినీ దత్ హాజరుకానున్నారు. ఇప్పటివరకు ఏ ఇండియన్ సినిమాకు దక్కని గౌరవం ఈ మూవీకి లభించనుంది. కామిక్ వేడుకల్లో ప్రదర్శించనున్న తొలి సినిమాగా ఇది చరిత్రకెక్కనుంది. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై నిర్మాత అశ్వినీదత్ ఈ సినిమాను భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు.
Also Read: Takkar OTT: ఓటీటీలో రానున్న సిద్ధార్థ్ ‘'టక్కర్'’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook