Srivalli English song: అల్లు అర్జున్ హీరోగా, రశ్మికా మందాన్న హీరోయిన్​గా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'పుప్ప- ది రైజ్' సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఈ సినిమాలో పాటలు కూడా అంతే సూపర్ హిట్​ అయ్యాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంకా చెప్పాలంటే..  పాన్ ఇండియా సినిమాగా గత ఏడాది డిసెంబర్​లో విడుదలైన ఈ సినిమా పాటలు అన్ని భాషల్లోనూ మ్యూజిక్​ లవర్స్​ను ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ సినిమా పాటలే వినిపిస్తున్నాయి. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందించిన.. ఈ పాటలు తాజాగా ఖండాంతరాలు దాటాయి.


విదేశాల్లోనూ క్రేజ్​..


విదేశాల్లో సైతం చాలా మంది పుష్ప పాటలను విపరీతంగా ఎంజాయ్​ చేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ సినిమాలో ఓ పాటను ఇంగ్లీష్​లోకి ట్రాన్స్​లేట్ చేసి మరీ పాడారు ఓ యూట్యూబ్ సింగర్​. తెలుగులో ఈ పాటను సిద్ శ్రీరామ్​ పాడారు.


తెలుగు మిక్స్​డ్ ఇంగ్లీష్​ లిరిక్స్​..


emmaheesters అనే యూట్యూబర్​ పుష్ప సినిమాలోని 'శ్రీవల్లి' పాటను ఇంగ్లీష్​లోకి అనువదించి పాడింది. అయితే అమె పాటలో 'చూపే బంగారమాయేనే శ్రీవల్లి.. మాటే మాణిక్యమాయేనే..' అనే లిరిక్స్​ను తెలుగులోనే పాడటం విశేషం. మిగతా భాగాన్ని ఇంగ్లీష్​లోకి అనువదించించి పాడింది.


అమె స్టైల్లో ఈ పాటకు మ్యూజిక్ జోడించి పాడింది. ఒరిజినల్ సాంగ్​లో ఉన్న ఫీల్​ను కూడా అమె పాటలో ఉండటం విశేషం.


ఈ పాటను ఫిబ్రవరి 4న యూట్యూబ్​లో పెట్టగా.. ఇప్పటికే 5.20 లక్షల మంది వీక్షించారు. 58 వేల మందికిపైపగా లైక్ చేశారు.



ఇక ఈ పాట విన్న ఇండియన్స్​ అంతా.. కామెంట్స్​లో emmaheesters పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. మరికొందరు తెలుగు పాట ఖండాలు దాటిందంటూ స్పందిస్తున్నారు.


మొత్తానికి శ్రీ వల్లి ఇంగ్లీష్ వర్షన్ పాటకు ప్రశంసలు దక్కుతున్నాయి. మరి ఆ పాటను మీరు వినేయండి.


Also read: Jayasudha: టాలీవుడ్‌ను వ‌ద‌ల‌ని క‌రోనా.. సహజనటి జయసుధకు పాజిటివ్..!


Also read: F3 First Lyrical Song: మనీకి అంతం లేదు.. ఈ MONEY ANTHEM కి తిరుగు లేదు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook