Jayasudha: టాలీవుడ్‌ను వ‌ద‌ల‌ని క‌రోనా.. సహజనటి జయసుధకు పాజిటివ్..!

Jayasudha: సినీ పరిశ్రమలో కరోనా మహామ్మారి విజృంభిస్తుంది. తాజాగా సహజనటి జయసుధ కొవిడ్ బారిన పడ్డారు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 7, 2022, 04:03 PM IST
  • కరోనా బారినపడ్డ సహజనటి!
  • అమెరికాలో చికిత్స తీసుకుంటున్న సీనియర్ నటి
Jayasudha: టాలీవుడ్‌ను వ‌ద‌ల‌ని క‌రోనా.. సహజనటి జయసుధకు పాజిటివ్..!

Jayasudha Corona News: కరోనా ఎవరినీ వదలడం లేదు. అన్ని రంగాలను అతలాకుతులం చేస్తోంది. ముఖ్యంగా సినీపరిశ్రమను కొవిడ్ (Covid-19) పట్టిపీడిస్తోంది. గత కొన్ని రోజులుగా రోజుకో స్టార్ కరోనా బారినపడుతున్నారు. తాజాగా సహజనటి జయసుధకు (Actress jayasudha) కరోనా సోకినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు, కీర్తి సురేష్ వంటి సినీ ప్రముఖులు కొవిడ్ బారినపడి..ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. 

గత కొన్ని రోజులుగా సీనియర్ నటి జయసుధ అనారోగ్యంతో బాధపడుతున్నారు. దాని చికిత్స నిమిత్తం అమెరికాకు వెళ్లి...అక్కడ కోలుకున్నారు. ఆ వార్త విని సంతోషించే లోపు ఆమె కరోనా మహమ్మారి బారిన పడినట్లు సమాచారం. ప్రస్తుతం జయసుధ హోమ్ ఐసోలేషన్ లో ఉండి చికిత్స తీసుకుంటున్నారని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. దీంతో జయసుధ త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు కోరుకుంటున్నారు.

చాలా రోజులుగా జయసుధ సినిమాలకు దూరంగా ఉంటున్నారు. పద్నాగేళ్ల వయసులోనే సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె పలు భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. తెలుగులో ఉన్న సూపర్ స్టార్స్ అందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. 

Also Read: Lata Mangeshkar: లతా మంగేష్కర్​కు కన్నీటి వీడ్కోలు- ప్రధాని మోదీ సహా ప్రముఖుల నివాళులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News