Rise of Shyam: The first lyrical song of from Nani's 'Shyam Singha Roy' to be unveiled on this date: నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం శ్యామ్‌సింగరాయ్‌. ఈ మూవీలో సాయిపల్లవి, (Saipallavai) కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాహుల్‌ సంకృత్యాన్‌ (Rahul Sankrityan) దర్శకత్వంలో వెంకట్‌ బోయనపల్లి నిర్మించిన ఈ మూవీ డిసెంబర్ 24న రిలీజ్ కానుంది. ఇక ఈ మూవీలోని లిరికల్‌ వీడియోను ‘రైజ్‌ ఆఫ్‌ శ్యామ్‌’ (Rise of Shyam) పేరుతో నవంబరు 6న విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ తెలిపింది. శ్యామ్‌ క్యారెక్టరైజేషన్‌ను వివరిస్తూ ఈ పాట సాగనున్నట్లు తెలుస్తోంది. మిక్కీ జె. మేయర్‌ (Mickey J Meyer) ఈ మూవీకి సంగీతం అందించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read : National Sports Awards: నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్.. విజేతలకు నవంబరు 1న ప్రదానోత్సవం


ఇక నాని ఇటీవల దసరా రోజున ఆయన మరో సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. దసరా (Dasara)అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాలో నాని (Nani) తెలంగాణ యాసలో మాట్లాడబోతున్నారట. సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా శ్రీకాంత్‌ ఓదేల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ మూవీలో కీర్తి సురేష్ (Keerthy Suresh) హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో రెండో హీరోయిన్‌కు కూడా అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ పాత్ర కోసం సమంతను (Samantha) తీసుకుంటున్నారట.


Also Read : Niloufer Hospital: హైదరాద్ లో దారుణం.. రూ.100 కోసం బాలుడి ప్రాణం తీసిన వార్డ్ బాయ్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి