Nani Shyam Singha Roy : డిసెంబర్‌‌లో శ్యామ్ సింగరాయ్ రిలీజ్‌, నాని.. వాసు లుక్ విడుదల

Shyam Singha Roy To Release In December: శ్యామ్ సింగరాయ్ లో నాని నటించిన వాసు పాత్రకు సంబంధించిన లుక్ ని మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. నాని.. వాసు మోషన్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఇందులో నాని కాళికాదేవి ముందు నిల్చుని కనిపించాడు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 14, 2021, 06:57 PM IST
  • నాని శ్యామ్ సింగరాయ్ నుంచి నటించిన వాసు లుక్ రిలీజ్‌
  • డిసెంబర్‌‌లో మూవీ రిలీజ్
  • పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోన్న శ్యామ్ సింగరాయ్
Nani Shyam Singha Roy : డిసెంబర్‌‌లో శ్యామ్ సింగరాయ్ రిలీజ్‌, నాని.. వాసు లుక్ విడుదల

Nani and Sai Pallavis Shyam Singha Roy To Release In December: రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కుతున్న చిత్రం శ్యామ్ సింగరాయ్. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన లుక్స్ విడుదలైన మూవీపై అంచనాలను పెంచాయి. తాజాగా నాని నటించిన వాసు (Vasu) పాత్రకు సంబంధించిన లుక్ ని మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. నాని...వాసు మోషన్ పోస్టర్ (motion poster) ఆకట్టుకుంటోంది.
ఇందులో నాని (nani) కాళికాదేవి ముందు నిల్చుని కనిపించాడు.
 
వాసు పాత్రలో నానీ ఆకట్టుకుంటారని పోస్టర్‌ను చూస్తే తెలుస్తోంది.ఈ  చిత్రంలో నాని బెంగాలీ కుర్రాడిగా (Bengali) శ్యామ్ సింఘరాయ్ పాత్రలో ( Shyam Singha Roy) కనిపిస్తారు. అలాగే వాసుగా గుబురు గడ్డం, వెరైటీ హెయిర్ స్టైల్‌తో మెప్పించనున్నారు నాని.
 
ఇక ఈ మూవీ డిసెంబర్‌‌లో (December) ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీలో సాయి పల్లవి, ( Sai Pallavi) కృతి శెట్టి, (Krithi Shetty) మడోన్నా సెబాస్టియన్ లు నటిస్తున్నారు. అలాగే మిక్కీ జె మేయర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

Also Read : Aryan Khan’s bail plea in drugs case: ఆర్యన్ ఖాన్‌కి మళ్లీ షాక్ ఇచ్చిన కోర్టు

కొద్ది నెలల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో వి.ఎఫ్.ఎక్స్. కు ప్రాధాన్యం ఎక్కువగా ఉండటం వల్ల నిర్మాణానంతర కార్యక్రమాలకు అధిక సమయం పడుతోందని రాహుల్ సాంకృత్యన్ (Rahul Sankrityan) తెలిపారు. 

అయితే  శ్యామ్ సింఘరాయ్ (Shyam Singha Roy) మూవీని థియేటర్లలో రిలీజ్ చేస్తారా.. లేదా ఓటీటీలో వదులుతారా? అనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు. అయితే మూవీ డిసెంబర్‌‌లో రిలీజ్‌ అవుతుందని అనౌన్స్‌మెంట్ వచ్చింది కానీ డేట్ ఇంకా రివీల్ చేయలేదు.

 

Also Read : KTR in TRS Plenary: తెలంగాణ పథకాల్ని కేంద్రం అమలు చేస్తోంది: కేటీఆర్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News