Samantha Item Song: మరింత సెక్సీగా కన్పించాలంటే ఏం చేయాలో చెప్పిన సమంత
Samantha Item Song: ఊ అంటావా పాటతో హల్‌చల్ రేపిన టాలీవుడ్ అందాల తార సమంతా మరోసారి హాట్ కామెంట్స్ చేసి సంచలనం రేపింది. సెక్సీగా ఉండాలంటే ఏం చేయాలో చెప్పి..అందర్నీ ఆశ్చర్యపర్చింది.
Samantha Item Song: ఊ అంటావా పాటతో హల్‌చల్ రేపిన టాలీవుడ్ అందాల తార సమంతా మరోసారి హాట్ కామెంట్స్ చేసి సంచలనం రేపింది. సెక్సీగా ఉండాలంటే ఏం చేయాలో చెప్పి..అందర్నీ ఆశ్చర్యపర్చింది.
టాలీవుడ్ పాన్ ఇండియా మూవీగా ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదలై మెగా హిట్‌టాక్‌తో దూసుకుపోతున్న పుష్ప సినిమా(Pushpa Movie)ఇంకా హాపిక్‌గానే నిలుస్తోంది. ఊ అంటావా మావా..ఊహూ అంటావా మావా పాటతో అందర్నీ ఉలిక్కిపడేలా చేసిన సమంతా ఐటమ్ సాంగ్ రేపుతున్న దుమ్ము అంతా ఇంతా కాదు. సెక్సియెస్ట్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ అనే మాటలు కూడా విన్పిస్తున్నాయి. పాట లిరిక్స్ పరంగా, డ్యాన్స్ పరంగా, కాస్ట్యూమ్స్ పరంగా ఓ రేంజ్‌లో ఉండటంతో చాలా ట్రెండ్ అవుతోంది. పాట విడుదలైన వెంటనే యూట్యూబ్‌లో అత్యంత వేగంగా దూసుకుపోయింది. ఈ పాటకు రెస్పాన్స్ ఎంతగా వచ్చిందో..విమర్శలు కూడా అదే స్థాయిలో వచ్చాయి. ముఖ్యంగా మీ మగబుద్ధి వంకరబుద్ధి లిరిక్స్‌పై వివారం రేగింది. సినిమా ఎంత బ్లాక్ బస్టర్ అయిందో..ఊ అంటావా మావా పాట(Oo antava mava song)కూడా అంతే హిట్ అయింది. బాక్సాఫీసు వద్ద ఈ పాట ఇంకా సెన్సేషన్ రేపుతూనే ఉంది. కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
ఇప్పుడీ ఐటమ్ సాంగ్‌పై సమంత(Samantha)నేరుగా స్పందించింది. ఇప్పటి వరకూ ఈ పాటపై వస్తున్న ట్రోల్స్‌కు పరోక్షంగా స్పందించిన సమంతా ఈసారి నేరుగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. నేను బాగా చేశాను..చెడుగా కూడా చేశాను. కొన్ని సందర్భాల్లో ఫన్నీగా..కొన్ని సందర్భాల్లో సీరియస్‌గా ఉన్నాను. తీసుకునే ప్రతి నిర్ణయంలో రాణించేందుకు కష్టపడుతున్నాను.సెక్సీగా ఉండేందుకు అంతకుమించి హార్డ్‌వర్క్ చేయాలి అంటూ హాట్ కామెంట్స్ చేసింది. సమంత చేసి ఈ వ్యాఖ్యలిప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి. ఇప్పటికే చాలా హాట్‌గా , సెక్సీగా కన్పించిందంటూ వస్తున్న ట్రోల్స్‌కు సమాధానంగా మరింత సెక్సీ కన్పించాలంటే ఏం చేయాలో చెప్పడమేంటనే ప్రశ్నలు వస్తున్నాయి.
Also read: Samantha: 'పుష్పరాజ్‌గా బన్నీ అదరగొట్టేశారు..ఆయనను స్పూర్తిగా తీసుకుంటా'..: సమంత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook