Aryan Khan's bail plea live updates: షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌కి ముంబై కోర్టు షాక్ ఇచ్చింది. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఆర్యన్ ఖాన్‌కి బెయిల్ ఇవ్వడానికి కోర్టు నో చెప్పింది. ఆర్యన్ ఖాన్‌తో పాటు అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమేచకు కూడా కోర్టు బెయిల్ మంజూరు చేయడానికి తిరస్కరించింది. ప్రాసిక్యూషన్ తరపున వాదనలు వినిపించిన ఏ.ఎస్.జి. సింగ్ (ASG Singh) ఆర్యన్ ఖాన్‌కి బెయిల్ మంజూరు చేయకూడదని వాదించడంతో పాటు.. ఆర్యన్‌కి రిమాండ్ విధించడం తప్ప బెయిల్ మంజూరు చేసే అధికారం కూడా ఈ కోర్టుకు లేదని వాదించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఘటనాస్థలానికి ఆర్యన్ అనుకోకుండానే వెళ్లాడని ఆర్యన్ తరపు లాయర్ కోర్టుకు తెలిపారు. ఆర్యన్ స్టార్స్ ఫ్యామిలీకి చెందిన కుర్రాడని, సమాజంలో గౌరవం కలిగిన కుటుంబం నుంచి వచ్చిన ఆర్యన్‌కి ఇండియన్ పాస్‌పోర్ట్ కూడా ఉంది. అందుకే ఆర్యన్ దేశం విడిచిపారిపోయే ప్రమాదం లేదని ఆర్యన్ తరపు న్యాయవాది సతీష్ కోర్టుకు విన్నవించారు. 


ఆర్యన్ తరపు లాయర్ వాదనలపై ఏ.ఎస్.జి. సింగ్ అభ్యంతరం తెలిపారు. ఆర్యన్ వాట్సాప్ చాట్ (Aryan whatsapp chat), స్టేట్మెంట్‌తో పాటు ఘటనాస్థలంలో నిందితులు ఉండటం వంటి పరిణామాలన్నీ యాదృచ్చికం ఎలా అవుతాయని సందేహం వ్యక్తంచేశారు. సాక్ష్యాధారాలను ప్రభావితం చేసేంత స్థాయి కలిగిన వ్యక్తులకు బెయిల్ మంజూరు చేస్తే.. సాక్ష్యాధారాలు తారుమారయ్యే ప్రమాదం ఉందని సింగ్ ఆందోళన వ్యక్తంచేశారు. 



Also read : MAA Elections 2021: ‘మా’ ఎన్నికల ప్రక్రియలో మార్పు.. తుది ఫలితాలు అప్పుడే


ఆర్యన్ ఖాన్‌ని ముంబైలోని ఆర్థర్ జైలుకు (Aryan in Arthur Jail) తరలించారు. నిందితులను మొదటి 3-5 రోజులు క్వారంటైన్ సెల్లో ఉంచనున్నట్టు ఆర్థర్ జైలు సూపరింటెండెంట్ నితిన్ వేచల్ తెలిపారు.


Also read : Samantha Emotional Post: "నాపై వ్యక్తిగత దాడి సమంజసం కాదు": సమంత ఎమోషనల్ పోస్ట్


Also read : Seetimaarr Movie : త్వరలో ఓటీటీలో గోపీచంద్‌ ‘సీటీమార్‌’ మూవీ స్ట్రీమింగ్‌


Also read : Konda Polam Movie Review: వైష్ణ‌వ్‌తేజ్ నటించిన 'కొండ పొలం' సినిమా రివ్యూ


Also read : ChaiSam Divorce: సమంత షాకింగ్ పోస్ట్... ట్రోల్స్ చేస్తున్నవారికి స్ట్రాంగ్ వార్నింగ్.. పోస్ట్ వైరల్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook