Sudugali Sudhir Team Out of Jabardast Show: గత కొన్ని సంవత్సరాల నుండి వారంలో రెండు రోజు వచ్చే కామెడీ షో 'జబర్దస్త్' (Jabardasth Comedy Show).. ఎన్నో టెన్షన్ లతో సతమతం అయ్యే వారికి కాస్త సమయం ఊరట కలిపించే షో.. 'జబర్దస్త్'. బుధవారం, గురువారం వచ్చిందంటే చాలు.. ఈ షో కోసమే ఎదురుచూసే వాళ్లు ఉన్నారంటే ఇది ఎంత ఫేమసో తెలుస్తుంది కదా!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎంతో మంది కమెడియన్లు జబర్దస్త్ లో రాణిస్తూ.. సినిమాల్లో కుడి మంచి అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. వీరిలో సుడిగాలి సుధీర్ (Sudigali Sudhir) కూడా ఒకరు. తనదైన కామెడీతో అలసరిస్తూ... ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెంచుకున్నారు. సుధీర్ మంచి నటుడే కాదు, మంచి డ్యాన్సర్, కమెడియన్, మెజీషియన్, యాంకర్... ఇలా చాలా రకాల టాలెంట్ లు అతని సొంతం, ఇటీవలే హీరో గా కూడా కొన్ని సినిమాల్లో నటించాడు. 


Also Read: Chandra Grahanam 2021: నవంబర్ 19న కార్తీక పౌర్ణమి.. ఆ రోజే చివరి చంద్ర గ్రహణం.. ఆ రాశిపై ప్రభావం!


ప్రస్తుతం సుడిగాలి సుధీర్ జబర్దస్త్ వదిలి వెళ్తున్నాడని వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. మల్లెమాల సంస్థ (MalleMala TV) నుండి పూర్తిగా వైదోలగుతున్నట్లు సమాచారం. సినిమాల్లో మంచి మంచి అవకాశాలు వస్తున్న కారణంగా జబర్దస్త్ షోకు సమయం కేటాయించలేకపోతున్నట్లు తెలుస్తుంది. ఈ కారణం చేతనే జబర్దస్త్ వాడాలి వెళ్తున్నట్లు సమాచారం. ఇటీవల జబర్దస్త్ కామెడీ షో అగ్రిమెంట్ పై కూడా సంతకము చేయలేదని తెలుస్తుంది. 


సుధీర్ మాత్రమే కాకూండా.. టీమెంట్స్ ఆటో రామ్ ప్రసాద్ (Auto Ram Prasad), గెటప్ శ్రీను (Jabardasth Srinu) కూడా జబర్దస్త్ షో వీడనున్నట్లు సమాచారం. వీరిద్దరూ కూడా సినిమాల్లో మంచి అవకాశాలను అందిపుచ్చుకుంటూ రాణిస్తున్నారు. ఒకవేళ ఈ వార్త నిజమైతే జబర్దస్త్ యాజమాన్యానికి తీవ్ర నష్టం అనే చెప్పాలి. ఎందుకంటే.. ఈ ముగ్గురు చేసే కామెడీ కోసమే కొంతం మంది జబర్దస్త్ చూస్తున్నారు అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ ముగ్గురు జబర్దస్త్ వదిలి వెళ్తే.. షో రేటింగ్స్ అమాంతం పడిపోయే అవకాశాలున్నాయి. ఈ వార్తలో ఎంత నిజం ఉందొ తెలియాలంటే మరికొంత కాలం వేచిచూడాల్సిందే!


Also Read: 10 digit Mobile Number: అవును.. ఫోన్ నంబర్ 10 అంకెలు మాత్రమే ఎందుకు ఉంటుంది..? పదండి తెలుసుకుందాం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook