Sonu Sood bought bunglow in Hyderabad: సోనూ సూద్ హైదరాబాద్‌లో ఓ ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసినట్టు సినీవర్గాలు చెబుతున్నాయి. ఫిలింనగర్ అప్‌డేట్స్ ప్రకారం బంజారాహిల్స్‌లోని పాష్ లొకాలిటీలో అంతే అందమైన, అన్ని హంగులతో తీర్చిదిద్దిన ఖరీదైన బంగ్లా కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. టాలీవుడ్ సినీ పరిశ్రమతో, తెలుగు ఆడియెన్స్‌తో, రెండు తెలుగు రాష్ట్రాలతో విడదీయరాని అనుబంధం ఉన్న సోనూ సూద్‌కి కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి తరువాత అభిమానుల సంఖ్య మరింత పెరిగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనావైరస్ COVID-19 కష్టకాలంలో దేశం నలుమూలలా ఎంతో మందికి అండగా నిలిచి వారి ప్రాణాలు కాపాడి, ఇంకెంతో మందికి ఆకలి తీర్చి, లాక్‌డౌన్ కారణంగా సొంతూళ్లకు వెళ్లలేని వారిని సొంతూళ్లకు తరలించిన సోనూ సూద్‌కి దేశ వ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఎంతో మందికి ప్రత్యక్ష దైవంగా మారిన సోనూ సూద్ ప్రతీ కదలికపై మీడియాతో పాటు ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఈ క్రమంలోనే సోను సూద్ హైదరాబాద్‌లో ఖరీదైన బంగ్లా (Sonu Sood's bunglow in Hyderabad) కొనుగోలు చేశారనే వార్త కూడా వైరల్ అవుతోంది.


Also read : Evaru Meelo Koteeswarulu: ఎవరు మీలో కోటీశ్వరులు షోలో Jr Ntr, Ram Charan ? 


ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న ఆచార్య మూవీతో (Acharya movie) పాటు మరెన్నో ఇతర సినిమాలకు సైన్ చేసిన సోనూ సూద్.. ఆగస్టులో హైదరాబాద్‌లో తన కొత్త ఇంట్లోకి (Sonu Sood's flat in Hyderabad) షిఫ్ట్ అవుతారని సమాచారం. హైదరాబాద్ కేంద్రంగానే తన సేవా కార్యక్రమాలు కొనసాగించేందుకు సోనూ సూద్ నిర్ణయం తీసుకున్నట్టు టాక్.


Also read : Baby O Baby Lyrical Video Song: మాస్ట్రో నుంచి బేబీ ఓ బేబీ లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook