Rajinikanth To Be Conferred With Dadasaheb Phalke Award: భారతీయ చలనచిత్ర పరిశ్రమలో చేసే గణనీయమైన సేవలకుగానూ అందించే అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే. 2020 ఏడాదికిగానూ ఈ అవార్డును దక్షిణాది సూపర్ స్టార్, కోలీవుడు అగ్రనటుడు రజనీకాంత్‌ను వరించింది. కేంద్ర సమాచార ప్రసారాల మంత్రిత్వశాఖ రజనీకాంత్‌కు ఈ అవార్డును ప్రకటించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారతీయ సినిమాకు పితామహుడైన దాదాసాహెబ్ ఫాల్కే గౌరవార్థం ప్రతి ఏడాది సినీ ప్రముఖులు ఒకరికి ఈ అత్యున్నత సినీ పురస్కారం ప్రకటించి గౌరవిస్తారు. ఈ క్రమంలో 2020 ఏడాదికిగానూ రజనీకాంత్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించారు. జాతీయ సినీ పురస్కారాలు ప్రదానం చేసే సమయంలో ఈ అత్యున్నత సినీ అవార్డును విజేతలకు అందజేస్తారని తెలిసిందే. డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ దక్షిణాది సూపర్‌స్టార్ రజనీకాంత్(Rajinikanth) సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును ప్రదానం చేసి సత్కరించనుంది.


Also Read: Nagarjuna Latest Look: టాలీవుడ్ కింగ్ నాగార్జున అక్కినేని వైల్డ్ డాగ్ లుక్ స్టిల్స్ వైరల్



సినీ రంగానికి చేసిన విశిష్టసేవలకు గుర్తింపుగా రజనీకాంత్‌కు అవార్డు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ గురువారం ఉదయం ప్రకటించారు. రజనీకాంత్ 2020లో దర్బార్ సినిమాలో చివరిసారిగా వెండితెర మీద కనిపించారు. 4 దశాబ్దాలుగా రజనీకాంత్ సినీ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నారు. తనదైన నటనతో సినీ రంగానికి చేస్తున్న సేవలకుగానూ అత్యున్నత సినీ పురస్కారం Dadasaheb Phalke Award అందుకోనున్నారు.


Also Read: SBI Alert: ఖాతాదారులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలర్ట్, నేడు ఈ సేవలకు అంతరాయం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook