Suriyas Etharkkum Thunindhavan to release in theatres on Feb4 2022 Watch prom: తమిళ హీరో సూర్య (Tamil hero Surya) వరుసగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నారు. తాజాగా రిలీజైన జైభీమ్‌ మూవీతో సక్సెస్ అందుకున్న సూర్య.. మరో మూడు నెలల్లో ‘ఎత్తర్కుమ్‌ తునింధవన్‌’ ( Etharkkum Thunindhavan) మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 2022 ఫిబ్రవరి 4న (Feb4 2022) థియేటర్లలో ఈ మూవీ రిలీజ్ కానుంది. ఇక ఇదే విషయాన్ని మూవీ యూనిట్ సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. ఇందుకు సంబంధించి ఒక వీడియోను కూడా విడుదల చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సూర్య పంచె ధరించి మాస్‌ బీట్‌కి (Mass beat) చేసిన డ్యాన్స్ అదిరిపోయింది. యాక్షన్‌ థ్రిల్లర్‌లో సాగే ఈ మూవీకి పాండిరాజ్‌ (Pandiraj) డైరెక్షన్ చేస్తున్నారు. సన్‌ పిక్చర్స్‌ ఈ మూవీ నిర్మిస్తోంది. రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తునారు. డి. ఇమ్మాన్‌ మ్యూజిక్ సమకూరుస్తుండగా.. ప్రముఖ తమిళ నటుడు శివకార్తికేయన్‌, నిర్మాత, దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ (Vignesh Sivan) ఈ సినిమా పాటలకు సాహిత్యమందిస్తున్నారు. వినయ్‌ రాయ్‌, ప్రియాంక అరుల్‌ మోహన్‌, శరణ్య, ఎం.ఎస్‌ భాస్కర్‌ కీలక పాత్రలు పోషించనున్నారు.



 


Also Read : ఇంటర్నేషనల్ మెన్స్ డే 2021: మెన్స్ డే ఎప్పుడు మొదలైంది, చరిత్ర, నేపథ్యం, గ్రీటింగ్స్


ఇక సుమారు రెండేళ్ల తర్వాత బిగ్ స్క్రీన్‌పై సూర్య కనిపించడంతో ఎప్పుడెప్పుడు మూవీ విడుదలవుతుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. కాగా సూర్య సినిమాలు తమిళ్‌తో పాటు తెలుగులోనూ రిలీజ్ అవుతుంటాయి. అయితే ఫిబ్రవరి 4న మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ఆచార్య మూవీ కూడా రిలీజ్ కానుంది. మరి ఆరోజే సూర్య సినిమా తెలుగులో వస్తుందా లేదా అనే విషయంలో క్లారిటీ లేదు. ముందుగా తమిళ్‌లో రిలీజ్ చేసి, తర్వాత కొద్ది రోజులకే తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది.


Also Read : చిరంజీవి చెల్లిగా నటించేందుకు నయనతారకు భారీ పారితోషికం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook