చిరంజీవి మూవీలో నటించేందుకు నయనతారకు భారీ పారితోషికం

Nayanthara shocking remuneration : ఇప్పుడు న‌య‌న‌తార గాడ్ ఫాద‌ర్ (Godfather) సినిమాకు తీసుకుంటున్న పారితోషికంపై పలు వార్తలు వస్తున్నాయి. తెలుగులో ఇప్ప‌టి వ‌ర‌కు హీరోయిన్ల‌కు ఇస్తోన్న పారితోషికంలో ఇదే అత్య‌ధికం అని తెలుస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 19, 2021, 04:49 PM IST
  • చిరంజీవి గాడ్ ఫాద‌ర్ లో న‌టించనున్న న‌య‌న‌తార
  • మెగాస్టార్... మోహ‌న్ రాజా కాంబోలో మూవీ
  • ఈ మూవీ కోసం భారీగా రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న నయనతార
చిరంజీవి మూవీలో నటించేందుకు నయనతారకు భారీ పారితోషికం

Nayanthara shocking remuneration for Megastar Chiranjeevi's upcoming Movie Godfather: ఓ వైపు స్టార్ హీరోల‌ సరసన హీరోయిన్‌గా న‌టిస్తూనే.. మ‌రోవైపు ఫీమేల్ ఓరియెంటెడ్ (Female Oriented) స్టోరీ మూవీలతో లేడీ సూప‌ర్ స్టార్‌గా క్రేజ్ సంపాదించుకుంటుంది న‌య‌న‌తార. నయన్ ప్ర‌స్తుతం చిరంజీవి.. (Chiranjeevi) గాడ్ ఫాద‌ర్ లో న‌టించే అవ‌కాశాన్ని అందుకుంది. మెగాస్టార్... మోహ‌న్ రాజా కాంబోలో ఈ సినిమా రాబోతుంది. పొలిటిక‌ల్ డ్రామా నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న ఈ మూవీ లూసిఫ‌ర్ (Lucifer) రీమేక్ అని తెలిసిందే. ఒరిజిన‌ల్ వెర్ష‌న్‌లో మంజు వారియ‌ర్ పోషించిన పాత్ర‌లో న‌య‌న‌తార క‌నిపించ‌నుంది. అయితే ఇప్పుడు న‌య‌న‌తార గాడ్ ఫాద‌ర్ (Godfather) సినిమాకు తీసుకుంటున్న పారితోషికంపై పలు వార్తలు వస్తున్నాయి. న‌య‌న్ ఈ మూవీ కోసం రూ.4 కోట్లు రెమ్యున‌రేష‌న్ ( Rs. 4 crores Remuneration) తీసుకుంటుందని టాక్. తెలుగులో ఇప్ప‌టి వ‌ర‌కు హీరోయిన్ల‌కు ఇస్తోన్న పారితోషికంలో ఇదే అత్య‌ధికం అని తెలుస్తోంది.

Also Read : మిస్టర్ 360 షాకింగ్ నిర్ణయం: అన్ని ఫార్మెట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన ఏబీడివిలియర్స్

తాజాగా న‌య‌న‌తార బ‌ర్త్ డే (Nayantara Birthday) సంద‌ర్భంగా మూవీ యూనిట్ ఆమె లుక్‌ను విడుద‌ల చేస్తూ శుభాకాంక్ష‌లు కూడా తెలిపింది. సైరా న‌రసింహారెడ్డి త‌ర్వాత చిరంజీవితో న‌య‌న‌తార నటిస్తోన్న రెండో సినిమా ఇది. ఇక గాడ్ ఫాద‌ర్ లో (Godfather) నయనతార రోల్‌ ఎంతో కీలకంగా ఉండనుందట. మునుపెన్నడూ లేనివిధంగా ఆమె పవర్ ఫుల్‌ లుక్‌లో కనిపించనున్నారట.

గాడ్ ఫాద‌ర్ మూవీని కొణిదెల ప్రొడెక్షన్స్‌, (Konidela Productions‌) సూపర్‌ గుడ్‌ ఫిల్మ్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సత్యదేవ్‌ ఈ సినిమాలో ఓ కీ రోల్‌ పోషిస్తున్నట్లు తెలుస్తోంది. నయనతార (Nayantara) భర్తగా సత్యదేవ్‌ కనిపించనున్నట్లు సమాచారం. 

Also Read : బంగార్రాజు'తో స్టెప్పులు వేయనున్న 'జాతిరత్నాలు' బ్యూటీ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News