Tiger Nageswara rao Movie run time: మాస్ మహారాజా రవితేజ(Ravi Teja) పాన్ ఇండియా మూవీ 'టైగర్ నాగేశ్వరరావు'. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. అంతేకాకుండా ఈ మూవీకి(Tiger Nageswara rao) భారీ ఓపెనింగ్స్ వస్తున్నాయి. అయితే ఈ మూవీ నిడివి ఎక్కువగా ఉందని ఫ్యాన్స్, విశ్లేషకులు నుంచి అభిప్రాయలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో చిత్రబృందం రన్ టైమ్ ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. 3.02 గంటల నిడివితో ఈ మూవీ రిలీజైంది. తాజాగా దానిని అరగంట తగిస్తూ అంటే 2.37 గంటలకు కుదించినట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో మరింత మంది ఆడియెన్స్ థియేటర్లకు క్యూ కట్టే అవకాశం ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యంగ్ డైరెక్టర్ వంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నుపుర్‌ సనన్‌, గాయత్రీ భరద్వాజ్‌, అనుపమ్‌ ఖేర్‌, రేణు దేశాయ్‌, జిషుసేన్‌ గుప్త, మురళీ శర్మ,  నాజర్‌ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌పై అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మించారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ మూవీపై వీర లెవల్లో అంచనాలను పెంచేశాయి. ఇండియాలో అతి పెద్ద గజదొంగగా పేరుగాంచిన స్టువర్టుపురం టైగర్ నాగేశ్వరరావు జీవితకథ ఆధారంగా ఈ మూవీ రూపొందుతోంది. నాగేశ్వరరావు పాత్రలో రవితేజ కనిపించనున్నాడు. లియో, భగవంత్ కేసరి సినిమాలతో పోలిస్తే ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. 


Also Read: Mangalavaram Movie: భయపెడుతున్న పాయల్ రాజ్‍పుత్... ఉత్కంఠగా 'మంగళవారం' ట్రైలర్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook