Golden Hour: గోల్డెన్ అవర్. వైద్య రంగంలో కీలకంగా పరిగణిస్తారు. సకాలంలో ప్రమాదానికి గురైన వ్యక్తిని ఆస్పత్రికి చేర్చగలిగే సమయం. ఇదే ఇప్పుడు ప్రముఖ టాలీవుడ్ నటుడు సాయి ధరమ్ తేజ్‌కు గోల్డెన్ అవకాశంగా మారింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రముఖ టాలీవుడ్ నటుడు, మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడైన సాయి ధరమ్ తేజ్‌కు(Sai Dharam Tej) ప్రాణాపాయం తప్పిందంటున్నారు వైద్యులు. సకాలంలో సాయి ధరమ్ తేజ్‌ను ఆసుపత్రికి తరలించడం వల్లనే ప్రాణాపాయం తప్పిందని చెబుతున్నారు. ఇదే గోల్డెన్ అవర్. వైద్య పరిభాషలో సకాలంలో రోగిని లేదా ప్రమాదానికి గురైన వ్యక్తిని ఆసుపత్రికి తీసుకురాగలిగిన సమయం. ఈ సమయంలో ఇచ్చిన మొదటి చికిత్స చాలా ముఖ్యమైంది. అదే ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ ప్రాణాల్ని కాపాడిందని చెబుతున్నారు మెడికవర్ వైద్యులు. సకాలంలో(Golder Hour)108 సిబ్బంది ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఎందుకంటే ప్రమాదంలో సాయి ధరమ్ తేజ్ కిందపడటంతోనే ఫిట్స్‌కు గురయ్యాడని..ఆసుపత్రికి తీసుకొచ్చే క్రమంలో అపస్మారక స్థితిలో ఉన్నాడని వైద్యులు తెలిపారు. మరోసారి ఫిట్స్ రాకుండా ముందుగా చికిత్స చేశామంటున్నారు. తరువాత బ్రెయిన్, స్పైనల్ కార్డ్, షోల్డర్, ఛెస్ట్ అబ్డామిన్ స్కానింగ్‌లు నిర్వహించామన్నారు. హెల్మట్ పెట్టుకోవడంతో తలకు గాయాలు కాలేదని వైద్యులు చెప్పారు. శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడటంతో కృత్రిమ శ్వాస పెట్టాల్సి వచ్చిందన్నారు. 


జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 కేబుల్ బ్రిడ్జి మార్గంలో స్పోర్ట్స్‌బైక్‌పై వెళ్తుండగా సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి గురయ్యాడు. అపస్మారక స్థితిలో ఉన్న సాయి ధరమ్ తేజ్‌‌‌ను మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. కుడికన్నుపై, ఛాతీ, పొట్టభాగంలో తీవ్రగాయాలైనట్టు వైద్యులు గుర్తించారు. ప్రాధమిక చికిత్స మెడికవర్ ఆసుపత్రిలో పూర్తయిన అనంతరం ఇప్పుడు అపోలో ఆసుపత్రిలో చికిత్స నిర్వహిస్తున్నారు. ఇవాళ కూడా ఐసీయూలోనే సాయి ధరమ్ తేజ్‌కు చికిత్స అందించనున్నారు. ఎప్పటికప్పుడు అతని ఆరోగ్య పరిస్థితిపై అపోలో(Apollo) వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేస్తున్నారు. 


Also read: Sai Dharam Tej Accident CCTV Footage: వైరలైన సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ CCTV ఫుటేజ్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook