Allu Arjun appreciates Gaami : గామి చిత్రబృందాన్ని అభినందించిన అల్లు అర్జున్
Allu Arjun appreciates Gaami`s team: టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకున్న హీరో విశ్వక్ సేన్ నటిస్తోన్న మూవీ.. గామి. ‘గామి’ సినిమా టైటిల్‌ని అల్లు అర్జున్ విడుదల చేశారు.
Tollywood Icon star Allu Arjun appreciates Gaami's movie unit: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. గామి మూవీ యూనిట్‌ను ప్రత్యేకంగా అభినందించారు. టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకున్న హీరో విశ్వక్ సేన్ (Vishwaksen) నటిస్తోన్న మూవీ.. గామి. విద్యాధర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. చాందిని చౌదరి, (Chandini Chowdary) అభినయ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సెల్యులాయిడ్, కార్తీక్ శబరిష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
యూవీ క్రియేషన్స్ పతాకంపై నిర్మితమవుతోన్న ‘గామి’ సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియోను (GAAMI Title Announcement) అల్లు అర్జున్ (Allu Arjun) శుక్రవారం విడుదల చేశారు. గామి.. టైటిల్ వీడియోని ట్విట్టర్‌లో షేర్ చేసిన బన్నీ.. కొత్త కథలతో తరచూ ప్రేక్షకుల్ని అలరిస్తోన్న యూవీ క్రియేషన్స్‌కి (UV Creations) నా హృదయపూర్వక అభినందనలు అంటూ ట్వీట్ చేశారు.
Also Read : Radhe Shyam:రాధేశ్యామ్ నుండి ప్రభాస్ మరోలుక్ విడుదల..లీకైన రాధేశ్యామ్ టీజర్ పిక్స్.?
సినిమా పట్ల యూవీ సంస్థకు (UV Creations) ఉన్న ఫ్యాషన్‌ని అల్లుఅర్జున్ (Allu Arjun) మెచ్చుకున్నారు. గామి గ్లిమ్స్ తనకు బాగా నచ్చిందన్నారు బన్నీ. మూవీ యూనిట్ మొత్తానికి అభినందనలు తెలిపారు. ఈ సినిమాలో చాలామంది నూతన నటీనటులే ఉన్నారు.. పరిశ్రమలోకి కొత్తతరం దర్శకులు రావడం ఆనందంగా ఉంది అంటూ అల్లు అర్జున్ (Allu Arjun) పేర్కొన్నారు. ‘గామి’ (GAAMI) మూవీ అఘోరాల నేపథ్యంలో సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇందులో విశ్వక్ డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నారు.
Also Read : Sam Harrison: వారెవ్వా...ఒకే ఓవర్‌లో 8 సిక్సర్లు కొట్టేశాడు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి