Allu Arjun: శ్రీచైతన్య విద్యా సంస్థలకు Brand ambassador అల్లు అర్జున్

Allu Arjun as brand ambassador of Sri Chaitanya: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లాంటి యువ నటుడితో భాగస్వామ్యం ద్వారా తమ విద్యాసంస్థలకు మరింత పేరు ప్రఖ్యాతలు లభిస్తుందని యాజమాన్యం పేర్కొంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 17, 2021, 05:46 AM IST
Allu Arjun: శ్రీచైతన్య విద్యా సంస్థలకు Brand ambassador అల్లు అర్జున్

Allu Arjun as brand ambassador of Sri Chaitanya: అల్లు అర్జున్‌ బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ జాబితాలో మరో బ్రాండ్ వచ్చిచేరింది. శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించేందుకు అల్లు అర్జున్ ఆ విద్యా సంస్థల యాజమాన్యంతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్మన్‌ డాక్టర్‌ బిఎస్. రావు, అకడమిక్‌ డైరెక్టర్‌ సుష్మ బొప్పన మీడియాకు తెలిపారు. 

యువతలో భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ కలిగిన అల్లు అర్జున్‌ శ్రీ చైతన్య విద్యా సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడం వల్ల తమ సంస్థలకు ఉన్న బ్రాండ్ వ్యాల్యూ మరింత పెరుగుతుందనే నమ్మకంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు శ్రీ చైతన్య విద్యా సంస్థల మేనేజ్‌మెంట్ (Sri Chaitanya educational institutions) వెల్లడించింది. 

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లాంటి యువ నటుడితో భాగస్వామ్యం ద్వారా తమ విద్యాసంస్థలకు మరింత పేరు ప్రఖ్యాతలు లభిస్తుందని యాజమాన్యం పేర్కొంది. ఇదిలావుంటే, మరోవైపు శ్రీచైతన్య విద్యాసంస్థలతో ఒప్పందం కుదుర్చుకోవడంపై అల్లు అర్జున్‌ (Allu Arjun advertisements) సైతం హర్షం వ్యక్తం చేశారని సంస్థ తమ పత్రికా ప్రకటనలో వెల్లడించింది.

Trending News