Ajith Kartikeya's Valimai Trailer Telugu: ఎంతో మంది ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురు చూస్తోన్న అజిత్ "వలిమై" మూవీ తెలుగు ట్రైలర్‌ రిలీజైంది. వలిమై ట్రైలర్‌ను మహేశ్‌ బాబు సోషల్‌ మీడియాలో రిలీజ్‌ చేశారు. 
ఈ మూవీ సక్సెస్‌ కావాలి కోరుతూ మహేశ్ బాబు ట్వీట్ చేశారు. ట్రైలర్ గ్రిప్పింగ్‌గా ఉందంటూ మహేశ్ పేర్కొన్నారు.కన్నడలో ఈ ట్రైలర్‌‌ను సుదీప్ రిలీజ్‌ చేయగా.. హిందీలో అజయ్‌దేవగణ్ విడుదల చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అజిత్, కార్తికేయ మధ్య మైండ్‌ బ్లోవింగ్ సీన్స్ ఉన్నాయి. ట్రైలర్‌‌ మొత్తం ట్విస్టుల మీద ట్విస్టులతో నడుస్తుంది. ఇక మూవీలో ఏ రేంజ్‌లో ట్వీస్టులు ఉంటాయో అర్థం అవుతోంది. వలిమై ట్రైలర్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచింది. రేసింగ్ సీన్స్‌.. బైక్ ఛేజింగ్ సీన్స్ హాలీవుడ్ లెవెల్‌లో ఉన్నాయి.


బైక్‌ ఛేజింగ్‌ సీన్స్‌తో స్టార్ట్ అయ్యే ఈ ట్రైలర్‌‌ ఆద్యంతం అదిరిపోయే సన్నివేశాలతో ఆకట్టుకుంటుంది. వలిమైలో అజిత్‌ సీబీసీఐడీ అధికారి పాత్రలో కనిపించనున్నారు. ఇక విలన్‌గా కార్తికేయ అదరగొట్టేశాడు. అజిత్‌.. కార్తికేయ లుక్స్‌ అదిరిపోయాయి. ఇద్దరి డైలాగ్స్‌ మెప్పించేలా ఉన్నాయి. హెచ్‌ వినోద్‌ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ మూవీలో హ్యూమా ఖురేషి హీరోయిన్‌గా నటించింది. 




అచ్చుత్‌ కుమార్‌, సుమిత్ర, యోగిబాబు తదితరులు ఈ మూవీలో కీ రోల్స్‌ ప్లే చేశారు. యువన్‌ శంకర్‌ రాజా అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది.జీ స్టూడియోస్‌తో కలిసి బోనీ కపూర్‌ "వలిమై" మూవీని నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 24వ తేదీన తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.


Also Read: Viral Video: కొరియాకు పాకిన 'శ్రీవల్లి' ఫీవర్.. అల్లు అర్జున్‌ హుక్ స్టెప్‌ను అచ్చు దించేసిందిగా! చుస్తే షాకే!!


Also Read: Monkey Fever in Kerala: కరోనా తగ్గుముఖం పట్టేలోపు దేశంలో మరో వైరల్ ఫీవర్ కలవరం!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook