Saindhav Pre-release Event: ‘ఆడవాళ్లు కచ్చితంగా ఏడుస్తారు.. తానే ఈ సినిమాకి హీరో’: వెంకటేష్
Venkatesh: వెంకటేష్ హీరోగా ఈ సంక్రాంతికి విడుదల కాబోతున్న చిత్రం సైంధవ్. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న ఘనంగా జరగగా..ఈ ఈవెంట్ లో మన వెంకీమామ మాట్లాడిన మాటలు ప్రస్తుతం అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాయి…
Saindhav: ఫ్యామిలీ సినిమాలకు పెట్టింది పేరు వెంకటేష్. అభిమానులందరూ వెంకీ మామ అని పిలుచుకునే మన వెంకీ తన 75వ సినిమాని మాత్రం వైలెంట్ గా ప్లాన్ చేశారు. విక్టరీ వెంకటేష్ నటించిన 75వ సినిమా సైంధవ్. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా జనవరి 13న విడుదలవుతోంది. ఈ చిత్రం విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండడంతో నిన్న ఆదివారం ఘనంగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాడు సినిమా టీమ్. ఇక ఈ ఈవెంట్‌లో ఎప్పటిలానే వెంకీ మామ ఫుల్ ఎనర్జీతో స్పీచ్ ఇచ్చారు.
ఈ ఈవెంట్ లో మాట్లాడుతూ ముందుగా అందరికీ కృతజ్ఞతలు చెప్పిన వెంకటేష్..’ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు.. అక్కా.. చెల్లి ..అమ్మ.. నాన్న.. తమ్ముడు.. అన్నా ఇలా అందరూ ఈ సినిమాను చూడాలి’ అని కోరాడు.
‘నాకు వైజాగ్ అంటే చాలా ఇష్టం. నా చిత్రాలు చాలా వరకు వైజాగ్ లోనే షూటింగ్ జరుపుకున్నాయి. సైంధవ్ సినిమా కూడా ఎక్కువ భాగం ఇక్కడే స్టీల్ ప్లాంట్‌లో షూట్ చేశాం. కుటుంబం అంతా కలిసి చూసే చిత్రమిది. దర్శకుడు ఈ సినిమాని చాలా కొత్తగా తీశాడు. ధర్మచక్రం, గణేష్, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే ఇలా నా చిత్రాలు ఎన్నో ఆదరించారు. ఈ సినిమా సంక్రాంతి పండక్కి వస్తుంది. సినిమా చూసి ఆడవాళ్లు కచ్చితంగా ఏడుస్తారు. ఈ సినిమాకు సారా పాపే హీరో. తాను చాలా అద్భుతంగా నటించింది. లైఫ్‌ను చాలా సీరియస్‌గా తీసుకోవద్దు. అందరికీ అన్నీ వస్తాయ్.. ఆ దేవుడు ఇస్తాడు’ అని చెప్పుకొచ్చాడు.
ఇక ఆ తర్వాత రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ.. దర్శకుడు శైలేష్ కొలను ఇచ్చిన స్పీచులో తన పేరు మర్చిపోయారని.. తాను హర్ట్ అయ్యానంటూ శైలేష్‌కు ఏదైనా శిక్ష వేయాలని వెంకీ మామను కోరాడు. దానికి వెంకీ మామ సమాధానం ఇస్తూ..అతను బాగా పాడతాడు.. ఆయనతో పాట పాడిద్దామని చెప్పాడు. ఏం పాట పాడిద్దామని వెంకటేష్ అనుకుంటూ ఉండగా.. క్రౌడ్‌లోంచి లడికి లడికి పాట అని అరిచేశారు. లడికి లడికి పాట ఏంట్రా.. ఆ టైం అయిపోయింది అంటూ వెంకీ మామ సెటైర్లు వేశాడు.
మొత్తం పైన సైంధవ్‌లోని పాటను శైలేష్ కొలను స్టేజ్ మీద పాడాడు. అతనితో పాటుగా రామజోగయ్య శాస్త్రి కూడా ఆ సాంగ్ ని పాడి అలరించారు. ఇక స్పీచ్ తో పాటు వెంకటేష్ సైంధవ్‌లోని పవర్ ఫుల్ డైలాగ్స్‌ను స్టేజ్ మీద చెప్పి అభిమానుల దగ్గర నుంచి విజల్స్ అందుకున్నారు.
Also read: Ram Mandir: అయోధ్య వెళ్లేవారు తప్పకుండా సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు..
Also Read: Sneha: మోదరన్ డ్రెస్సులు స్నేహ…చెక్కుచెదరని అంటోన్న అభిమానులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook