Vijay Deverakonda's Liger Movie Update: పూరి జగన్నాథ్- విజయ్ దేవరకొండ (Puri Jagannadh-Vijay Deverakonda Combo) కాంబోలో తెరకెక్కుతున్న సినిమా 'లైగర్' (Liger). డేరింగ్ డాషింగ్ డైరెక్టర్ పూరి- మాస్ యాక్టర్ విజయ్ కలయికలో వస్తున్న సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. కొంత కాలంగా ఈ సినిమాలో మైక్ టైసన్ నటిస్తున్నాడని వస్తున్న ప్రచారంపై ఎలాంటి అప్ డేట్ (Liger Movie Update) రాలేదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా వీటన్నిటికీ చెక్ పెడుతూ.. విజయ్ దేవరకొండ తన ట్విట్టర్ ఖాతాలో ఈ విషయం పై పోస్ట్ చేసాడు. "మీకు పిచ్చెక్కిస్తామని హామీ ఇచ్చాము.. ఇపుడు అది మొదలవబోతుంది.. ఇండియన్ స్క్రీన్ పై తొలిసారి మైక్ టైసన్ కనిపించబోతున్నాడు... ద బ్యాడెస్ట్ మ్యాన్ ఆన్ ప్లానెట్, గాడ్ ఆఫ్ బాక్సింగ్, వన్ అండ్ ఓన్లీ లెజెండ్, ది బీస్ట్… ఐరన్ మైక్ టైసన్ (Iron Mike Tyson)’ అంటూ విజయ్ దేవరకొండ పోస్ట్ చేసాడు. ఈ పోస్ట్ లో ఒక ఫోటోతో పాటు చిన్న వీడియోని కూడా షేర్ చేసాడు ప్రస్తుతం ఈ ట్వీట్ వైరలవుతుంది. 


Also Read: Cannibal Couple: 30మందిని పైగా చంపి తిన్న నరమాంస దంపతులు... ఎక్కడంటే..??




ఈ ప్రకటనతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయనటంలో ఎలాంటి సందేహం లేదు. మైక్ టైసన్ (Mike Tyson) మొదటి సారి ఇండియన్ స్క్రీన్ పై కనపడటం, అది కూడా తెలుగులో కావటం గొప్ప విశేషమనే చెప్పాలి. లైగర్ సినిమాలో మైక్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌లో ఎంతో నైపుణ్యం కలిగిన వ్యక్తి గా కనిపించబోతున్నాడు. ప్రస్తుతం గోవాలో (Goa) యాక్షన్ సీన్స్ ను చిత్రీకరణ జరుగుతుంది. 


మైక్ టైసన్ తో పాటు ఈ సినిమాలో ఇతర విదేశీ ఫైటర్లు ఈ సినిమాలో నటించనున్నారు. థాయిలాండ్ స్టంట్ డైరెక్టర్ కెచ్చా (Thiland Stund Director Kecha) యాక్షన్ సీక్వెన్స్‌ను కంపోజ్ చేస్తుండగా, విష్ణు శర్మ (Vishnu Sharma) సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.


ఇక సినిమా కాస్టింగ్ విషయానికి వస్తే విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే (Ananya Pandey) హీరోయిన్ గా నటిస్తుండగా, గెటప్ శ్రీను, మకరంద్ దేశ్ పాండే, రోనిత్ రాయ్, విష్ణురెడ్డి, ఆలి, రమ్యకృష్ణ (Ramya Krishna) ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. పూరి జగన్నాథ్ (Puri Jagannadh), ఛార్మీ కౌర్, కరణ్ జోహర్ (Karan Johar), అపూర్వ మెహతా కలిసి ‘లైగర్’ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలే ఉన్నాయి.


Also Read: Kondapolam Trailer: "మీ ఎనకాల గొర్రెలు కాదు కాదా.. వాటి బొచ్చుకుడా రాదు"


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


pple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook