Vijay Deverakonda Theatre: ప్రారంభమైన విజయ్‌ దేవరకొండ థియేటర్‌.. తల్లి కోసం స్పెషల్ షో!

asin vijay devarakonda : తెలంగాణలోని మహబూబ్‌నగర్‌లో అత్యాధునిక సౌకర్యాలతో భారీ థియేటర్‌ను నిర్మించాడు విజయ్‌ దేవరకొండ. ఏవీడీ (ఏషియన్‌ విజయ్‌ దేవరకొండ)గా పేరుతో ఈ హాల్‌ను నిర్మించాడు. ఈ థియేటర్‌ తాజాగా ప్రారంభమైంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 24, 2021, 04:38 PM IST
  • థియేటర్స్ బిజినెస్‌లోకి ఎంటరైన విజయ్
  • మహబూబ్‌నగర్‌లో అత్యాధునిక సౌకర్యాలతో భారీ థియేటర్‌
  • లవ్‌స్టోరీ సినిమా ప్రదర్శన
Vijay Deverakonda Theatre: ప్రారంభమైన విజయ్‌ దేవరకొండ థియేటర్‌.. తల్లి కోసం స్పెషల్ షో!

AVD Vijay Devarakonda theatre: విజయ్‌ దేవరకొండ ఒకవైపు సినిమాలతో పాటు మరోవైపు బిజినెస్‌ల్లోనూ రాణిస్తున్నాడు. ఇప్పటికే దుస్తుల వ్యాపారంలో దూసుకెళ్తున్న విజయ్‌ తాజాగా థియేటర్స్ బిజినెస్‌లోకి ఎంటరయ్యాడు. తెలంగాణలోని మహబూబ్‌నగర్‌లో అత్యాధునిక సౌకర్యాలతో భారీ థియేటర్‌ను నిర్మించాడు విజయ్‌ దేవరకొండ. ఏవీడీ (ఏషియన్‌ విజయ్‌ దేవరకొండ)గా (asin vijay devarakonda) పేరుతో ఈ హాల్‌ను నిర్మించాడు. ఈ థియేటర్‌ తాజాగా ప్రారంభమైంది.

విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) థియేటర్‌లో (theatre) తొలిసారి తన గురువు సినిమాను ప్రదర్శనకు ఉంచాడు. తనకు సినిమా అవకాశాలతో గుర్తింపు ఇచ్చిన శేఖర్‌ కమ్ములకు (sekhar kammula) కృతజ్ఞతగా ఆయన దర్శకత్వంలో వచ్చిన లవ్‌స్టోరీ సినిమాను విజయ్‌ దేవరకొండ తన థియేటర్‌‌లో ప్రదర్శించాడు. తన తల్లి మాధవి జన్మదినం సందర్భంగా విజయ్‌ దేవరకొండ థియేటర్‌‌ను (Vijay Deverakonda theatre) ప్రారంభించాడు.

Also Read : T20 World Cup in 2007: భళా భారత్... చరిత్రకు నిండిన 14 ఏళ్లు.. అలనాటి జ్ఞాపకాలు!

ఈ సందర్భంగా థియేటర్‌ హాల్‌లో తన తల్లి మాధవి ఉన్న ఫొటోతో పాటు హ్యాపీ బర్త్‌ డే మమ్ములు.. ఈ ఏవీడీ (AVD) (థియేటర్‌) నీకోసమే అంటూ విజయ్‌ సోషల్‌ మీడియాలో షేర్ చేశారు. నువ్వు ఆరోగ్యంగా ఉంటే నేను మరింత కష్టపడతా.. నీకు మరిన్ని జ్ఞాపకాలు ఇస్తా అంటూ తన తల్లిని ఉద్దేశించి విజయ్‌ పేర్కొన్నారు. ఇక విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) ప్రస్తుతం పూరీ జగన్నాథ్‌ డైరెక్షన్‌లో రూపొందుతున్న లైగర్‌ సినిమాలో నటిస్తున్నాడు.

Also Read : Love Story Review: ‘'లవ్ స్టోరీ'’ మూవీ ట్విట్టర్ రివ్యూ..ఎలా ఉందంటే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News