Vishwak Sen Clarity on Arjun Sarja Allegations: హీరో విశ్వక్సేన్ డైరెక్టర్ గా మారిన హీరో అర్జున్ సర్జా మధ్య వివాదం ఏర్పడిన సంగతి తెలిసిందే. విశ్వక్సేన్ కెరీర్ లో 11వ సినిమాగా అర్జున్ సర్జా డైరెక్షన్ లో ఒక సినిమా ఘనంగా ప్రారంభమైంది. పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ప్రారంభమైన ఈ సినిమాలో విశ్వక్సేన్ సరసన అర్జున్ సర్జా కుమార్తె ఐశ్వర్య అర్జున్ హీరోయిన్ గా నటించబోతుందని అప్పట్లో ఘనంగా ప్రకటించారు. అయితే ఈ ఉదయం అనూహ్యంగా విశ్వక్సేన్, అర్జున్ సర్జా సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఈ విషయం మీద సాయంత్రం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినా అర్జున్ సర్జా పూర్తి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సినిమా విశ్వక్సేన్ కి కూడా బాగా నచ్చిందని తర్వాత రెమ్యునరేషన్ విషయంలో కూడా అతను చెప్పిన విధంగా అగ్రిమెంట్ చేసుకున్నామని అన్నారు. అయితే కేరళలో షూటింగ్ మొదలు పెట్టిన సమయంలో అతని మేనేజర్ వచ్చి టైం కావాలన్నాడని ఆ షెడ్యూల్లో జగపతిబాబు కూడా ఉన్నారు. ఆయన డేట్స్ కూడా అప్పట్లో వేస్ట్ అయ్యాయని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత పలు సందర్భాల్లో అదే కంటిన్యూ చేశారని నా లైఫ్ లో ఇతనికి చేసినన్ని కాల్స్ మరి ఎవరికి చేయలేదని అర్జున్ పేర్కొన్నారు. తెలుగులో సీనియర్ హీరోలు ఎంతో కమిట్మెంట్తో ఉంటారని అన్నారు. అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ వంటి వారు ఎంతో డెడికేటెడ్ గా ఉంటారు కానీ ఇలాంటి వాతావరణంలో తాను సినిమా చేయలేనని అన్నారు.


ఈ రోజు తెలుగు సినీ పరిశ్రమ ఎంతో పెద్ద స్థాయిలో ఉందని కానీ ఇలాంటి హీరోతో తాను సినిమా చేయలేనని ఆయన అన్నారు. ఈ విషయం అందరికీ తెలియాలనే తను ప్రెస్ మీట్ పెట్టినట్లుగా ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాక రెండుసార్లు సినిమా షెడ్యూల్స్ రద్దు చేసి నన్ను నా టీం నీ విశ్వక్సేన్ అవమానించారని తెల్లవారుజామున నాలుగు గంటలకు మెసేజ్ పెట్టి షూటింగ్ కి రాలేనని అన్నారని అర్జున్ పేర్కొన్నారు. ఆ రోజు షూటింగ్ కోసం సెట్ రెడీ చేసేందుకు మా టీం అర్ధరాత్రి వరకు శ్రమించిందని చెప్పుకొచ్చారు. ఇక అనూప్ రూబెన్స్ మ్యూజిక్, బుర్ర సాయి మాధవ్, డైలాగ్స్ చంద్రబోస్ పాటలు విషయంలో కూడా నాతో విభేదించాడని ఈ నేపథ్యంలో విశ్వక్ ప్రవర్తన వల్ల ప్రస్తుతం సినిమా ఆపేసాను అని అన్నారు.


100 కోట్లు వచ్చినా నేను విశ్వక్ తో ఈ సినిమా చేయనని త్వరలోనే ఈ సినిమాకి కొత్త హీరోని టైటిల్ అనౌన్స్ చేస్తానని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ విషయం మీద విశ్వక్సేన్ ఎట్టకేలకు పెదవి విప్పాడు, ఈ సినిమా విషయంలో మాటలు పాటలు మ్యూజిక్ అన్నింటిలో కొన్ని సూచనలు చేసింది నిజమే కానీ అవి మార్చేందుకు అర్జున్ ఏ మాత్రం ఒప్పుకోలేదని అన్నారు. ఆయన చెప్పినట్లే నడుచుకోవాలని అంటున్నారు నా మాటకు సెట్ లో గౌరవం లేదు నా మనసుకు నచ్చని పని చేయలేక ఈ సినిమా నుంచి తప్పుకున్నానని విశ్వక్సేన్ స్పష్టం చేశారు. ఇక ఈ సినిమా విషయంలో రెమ్యునరేషన్, తీసుకున్న చెక్కులు, రాసుకున్న డాక్యుమెంట్లు అన్నీ నిర్మాతలు మండలికి పంపానని విశ్వక్సేన్ చెప్పుకొచ్చారు.


Also Read: Vishwak Sen out: పవన్ చేతుల మీదుగా ప్రారంభమైన సినిమా నుంచి విశ్వక్ అవుట్.. పెద్ద పంచాయితీ అయ్యేట్టుందే?


Also Read: Chittibabu Comments: దేవీ నువ్వు మగాడివేనా.. దమ్ముంటే ఆ పని చెయ్.. లైవ్ డిబేట్లో రెచ్చిపోయిన చిట్టిబాబు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook