Chittibabu Comments: దేవీ నువ్వు మగాడివేనా.. దమ్ముంటే ఆ పని చెయ్.. లైవ్ డిబేట్లో రెచ్చిపోయిన చిట్టిబాబు

Chittibabu Sensational Comments on Devi Sri Prasad: దేవి శ్రీ ప్రసాద్ చేసిన ఓ పరి అనే సాంగ్ వివాదానికి కారణమైన క్రమంలో జీ తెలుగు న్యూస్ ఒక లైవ్ డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్లో చిట్టిబాబు దేవి శ్రీ ప్రసాద్ మీద విరుచుకు పడ్డారు. ఆ వివరాల్లోకి వెళితే 

Written by - Chaganti Bhargav | Last Updated : Nov 5, 2022, 11:26 AM IST
Chittibabu Comments: దేవీ నువ్వు మగాడివేనా.. దమ్ముంటే ఆ పని చెయ్.. లైవ్ డిబేట్లో రెచ్చిపోయిన చిట్టిబాబు

Chittibabu Sensational Comments on Devi Sri Prasad: తెలుగు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ అనూహ్యంగా ఒక వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. గత ఏడాది పుష్ప సినిమాతో సూపర్ హిట్ అందుకున్న దేవిశ్రీప్రసాద్ ఈ మధ్యకాలంలో మళ్లీ తెలుగు సినిమాల మీద పెద్దగా దృష్టి పెట్టినట్లు కనిపించడం లేదు. ఇక ఈ క్రమంలో ఆయన ఒక పరి అనే ఒక రాక్ ఆల్బమ్ చేశారు దాన్ని తెలుగులో ఓ పిల్ల అనే పేరుతో కూడా విడుదల చేశారు.

పూర్తిస్థాయి వెస్ట్రన్ మ్యూజిక్ తో సాగిపోతున్న ఈ ఆల్బమ్ సాంగ్ లో హరే రామ హరే కృష్ణ కృష్ణ హరే హరే అనే ఒక మంత్రాన్ని వాడటం హిందూ సంఘాల వారికి ఆగ్రహాన్ని తెప్పించింది. ఈ విషయం మీద బీజేపీ నాయకురాలు, సినీ నటి కరాటే కళ్యాణి పెద్ద ఎత్తున ఫైర్ అవుతూ ఆయన మీద సైబర్ క్రైమ్ లో  పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పటికే ఈ విషయం మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసి ఎలా ముందుకు వెళ్లాలనే విషయం మీద లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా జీ తెలుగు న్యూస్ సంస్థ లైవ్ డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్లో హిందూ సంఘాల నుంచి లలిత్, సినీనటి కరాటే కళ్యాణి, సినీ నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా త్రిపురనేని చిట్టిబాబు దేవిశ్రీప్రసాద్ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తనకు దేవి శ్రీ ప్రసాద్ అంటే ఇష్టమని అంటూనే ఇలాంటి విషయాల్లో మాత్రం ఏ మాత్రం సపోర్ట్ చేసేది లేదని తెగేసి చెప్పారు. తాను కూడా ఒక రచయిత కుమారుడినేనని దేవిశ్రీప్రసాద్ కూడా ఒక మంచి రచయిత సత్యమూర్తి గారి కొడుకుని అన్నారు.

తన తండ్రి రచయిత అయినా వేరే రంగంలో అంటే మ్యూజిక్ రంగంలో పేరు తెచ్చుకున్న దేవిశ్రీప్రసాద్ అంటే తనకు చాలా ఇష్టమని కానీ ఇలా హిందూ దేవి దేవతలను కించపరుస్తూ వీడియోలు చేస్తే ఎవరినైనా ఊరుకునేది లేదని అన్నారు. ఈ సందర్భంగా నీకు మగతనం లేదా దేవిశ్రీప్రసాద్ అంటూ చిట్టిబాబు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. వేరే మతానికి సంబంధించిన ఒక పాటను పాడిన చిట్టి బాబు నీకు దమ్ముంటే నువ్వు మగాడివైతే ఇదే పాట నీ ఆల్బమ్స్ లో వాడుకోమని సవాల్ చేశారు.

హిందూ దేవి దేవతలను కించపరచడం ఫ్యాషన్ అయిపోయిందని దేవి సినిమాతో దేవి శ్రీ ప్రసాద్ హిట్ అందుకుని జనాలకు తెలిశాడని అలాంటి వ్యక్తి ఇప్పుడు హిందూ దేవతల మీద ఇలాంటి పాటలు చేయడం కరెక్టేనా అని తీవ్ర స్థాయిలో ఆయన ఫైర్ అయ్యారు. మరి ఈ విషయం మీద దేవి శ్రీ ప్రసాద్ ఎలా స్పందించబోతున్నారు అనేది వేచి చూడాల్సి ఉంది.

Also Read: RC 16 కోసం భారీ ప్లాన్.. చేతులు కలిపిన సుకుమార్ అభిషేక్ అగర్వాల్

Also Read: Vishwak Sen out: పవన్ చేతుల మీదుగా ప్రారంభమైన సినిమా నుంచి విశ్వక్ అవుట్.. పెద్ద పంచాయితీ అయ్యేట్టుందే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x