Vishwak Sen out: పవన్ చేతుల మీదుగా ప్రారంభమైన సినిమా నుంచి విశ్వక్ అవుట్.. పెద్ద పంచాయితీ అయ్యేట్టుందే?

Vishwak Sen walked out of Arjun Sarja's Film: అర్జున్ సర్జా డైరెక్టర్ గా విశ్వక్ సేన్ హీరోగా రూపొందనున్న సినిమా నుంచి విశ్వక్ సేన్ తప్పుకున్నాడని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే 

Written by - Chaganti Bhargav | Last Updated : Nov 5, 2022, 11:02 AM IST
Vishwak Sen out: పవన్ చేతుల మీదుగా ప్రారంభమైన సినిమా నుంచి విశ్వక్ అవుట్.. పెద్ద పంచాయితీ అయ్యేట్టుందే?

Vishwak Sen walked out of Action King Arjun Sarja's directorial Film: యంగ్ హీరో విశ్వక్సేన్ ఇటీవల వరుస సినిమాలతో దూసుకు వెళుతున్నాడు. తాజాగా ఓరి దేవుడా అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి డీసెంట్ హిట్ కొట్టిన విశ్వక్సేన్ ప్రస్తుతానికి పలు ఇతర ప్రాజెక్టుల్లో కూడా బిజీగా ఉన్నారు. అయితే యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా డైరెక్టర్ గా మారి చేస్తున్న ఒక తెలుగు సినిమాలో విశ్వక్సేన్ హీరోగా నటిస్తున్నట్లు గతంలో అధికారిక ప్రకటన వచ్చింది.

ఈ సినిమాకు సంబంధించిన ప్రారంభోత్సవం కూడా ఘనంగా జరిగింది. ఈ సినిమాలో అర్జున్ సర్జా కుమార్తె ఐశ్వర్య అర్జున్ హీరోయిన్ పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా ప్రారంభమైంది. ఒక షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. అయితే ఇలాంటి సమయంలో విశ్వక్సేన్ ఆ సినిమా నుంచి తప్పుకున్నాడని తెలుస్తోంది. అయితే అగ్రిమెంట్లో ఉన్నట్టు కాకుండా సడన్గా ఎలాంటి వాలిడ్ రీజన్స్ చెప్పకుండా బయటకు వెళ్లిపోవడంతో ఈ విషయం మీద ఫిలిం ఛాంబర్ లో విశ్వక్సేన్ మీద అర్జున్ సర్జా కంప్లైంట్ చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.

నిజానికి ఈ సినిమాని ప్రకటించిన సమయంలో ఎలాంటి టైటిల్ అనౌన్స్ చేయలేదు. విశ్వక్సేన్ 11 అనే పేరుతో ఈ సినిమాని అనౌన్స్ చేశారు. గతంలో అర్జున్ అనేక సినిమాలను రచించి డైరెక్షన్ చేశారు. అవి తమిళంలో, కన్నడలో మంచి హిట్ అయ్యాయి. తెలుగులో కూడా అభిమన్యు అనే పేరుతో ఒక సినిమా విడుదలై మంచి పేరు సంపాదించింది. ఇక ఈ సినిమా ప్రకటించిన సమయంలో సినిమా మీద భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి కానీ విశ్వక్సేన్ ఎందుకు ఇప్పుడు సినిమా నుంచి తప్పుకున్నాడు అనే విషయం మీద మాత్రం క్లారిటీ లేదు.

నిజానికి ఈ సినిమాని పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ప్రారంభించారు. జగపతిబాబు, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలలో నటిస్తున్నారని ప్రచారం జరిగింది. కానీ ఈ సినిమా నుంచి ఎందుకు ఆయన తప్పుకున్నాడు అనే విషయం మీద మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ప్రస్తుతానికి విశ్వక్సేన్ మరిన్ని ఆసక్తికర ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. సొంతంగా ఆయన ధమ్కీ అనే సినిమా చేస్తున్నారు. ఈ విషయం మీద విశ్వక్ సేన్ ఎలా స్పందిస్తారు అనేది చూడాలి మరి. 

Also Read: Recce At Pawan Kalyan House : పవన్ కల్యాణ్ ఇంటి ముందు రెక్కీ.. అసలు విషయం చెప్పిన పోలీసులు

Also Read: Devi Sri Prasad o Pari Song Controversy : దేవీ శ్రీ ప్రసాద్ ఓపరి వివాదం.. లీగల్ ఓపీనియన్ తీసుకుంటామన్న పోలీసులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News